Vikram 16 Days Collections: నెంబర్ వన్ రికార్డ్ బ్లాస్ట్ చేసిన కమల్ హాసన్.. తెలుగులో డబుల్ ప్రాఫిట్స్!
విశ్వ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కమల్ హాసన్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. విక్రమ్ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడి మొత్తంగా వెనక్కి తీసుకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం మొత్తం లాభాల్లోనే కొనసాగుతోంది. ఇక తెలుగులో కూడా ఈ సినిమా పెట్టిన పెట్టుబడి డబుల్ ప్రాఫిట్స్ అందించడం విశేషం. 16వ రోజు ఈ సినిమా ఒక నెంబర్ వన్ రికార్డును కూడా బ్లాస్ట్ చేసింది. మొత్తంగా ఇప్పటివరకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
కమలహాసన్ గత సినిమాలతో పోలిస్తే ఈసారి తెలుగులో చాలా తక్కువ బిజినెస్ జరిగింది. కేవలం ఈ సినిమాను ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ లో రెండు రాష్ట్రాల్లో కూడా విడుదల చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే విక్రమ్ సినిమా 100 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

16వ రోజు వచ్చిన కలెక్షన్స్
'విక్రమ్' సినిమాకు 16వ రోజూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ పెరిగాయి. మిగతా సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ గత వారం వరకు ఈ సినిమా మంచి వసూళ్లను సొంతం చేసుకోవడం విశేషం. ఇక 115వ రోజు 26 లక్షల షేర్ సాధించిన విక్రమ్ సినిమా 16వ రోజు మాత్రం కేవలం 28 లక్షల షేర్ రాబట్టింది. కొత్తగా తెలుగు సినిమాలు వచ్చినప్పటికీ ఈ రేంజ్ లో వసూళ్లు అందుకోవడం విశేషం.

మొత్తం 16 రోజుల కలెక్షన్స్
కమల్ హాసన్ 'విక్రమ్' ఏపీ తెలంగాణలో 16 రోజుల్లో అందుకున్న కలెక్షన్స్ ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 6.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.18 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.11 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 75 లక్షలు, గుంటూరులో రూ. 1.01 కోట్లు, కృష్ణాలో రూ. 1.12 కోట్లు, నెల్లూరులో రూ. 52 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 15.03 కోట్లు షేర్, రూ. 26.25 కోట్లు గ్రాస్ దక్కింది.

వరల్డ్ వైడ్ వచ్చిన టోటల్ షేర్
ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 16 రోజుల్లో రూ. 26.25 కోట్ల గ్రాస్ రాబట్టిన 'విక్రమ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగాను భారీగా కలెక్షన్స్ అందుకుంది. తమిళనాడులో 153.90 కోట్లు, కర్ణాటక 18.55 కోట్లు, కేరళ 34.10కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.70కోట్లు, ఓవర్సీస్ లో 112.05 కోట్లు వీటితో కలిపి 16 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ సినిమా రూ రూ. 353.81 కోట్లు గ్రాస్, 176.20 కోట్ల షేర్ వసూలు సాదించింది.

డబుల్ ప్రాఫిట్స్
'విక్రమ్' సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 100 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో రూ. 7 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 15.03 కోట్లు రావడంతో విక్రమ్ తెలుగు లో రూ. 7.52 కోట్ల ప్రాఫిట్స్ తో ముందుకి సాగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సినిమాకు 76కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం.

నెంబర్ వన్ రికార్డ్ బ్రేక్
కమల్ హాసన్ విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక తమిళనాడు 150 కోట్ల గ్రాస్ రావడం విశేషం. ఇది తమిళ రాష్ట్రంలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇంతకుముందు ఆ స్థానంలో బాహుబలి 2 సినిమా ఉండడం విశేషం. ఇక మొత్తానికి కమల్ హాసన్ అగ్ర స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications











