Vikram 18 Days Collections: కమల్ హసన్ కు కాసుల వర్షం.. ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్స్ ఎంతంటే?
వరుస అపజయలతో సతమతమవుతున్న కమల్ హాసన్ కు విక్రమ్ సినిమా సరికొత్త బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లను సాధించడంతో కమల్ హాసన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి అర్ధమయ్యింది. విక్రమ్ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని అన్ని భాషల్లో కూడా వెనక్కి తీసుకు వచ్చేసింది. ప్రస్తుతం సినిమా లాభాల్లోనే కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమా పెట్టిన పెట్టుబడి డబుల్ ప్రాఫిట్స్ రావడం విశేషం. ఇక 18వ రోజు ఎంత కలెక్ట్ చేసింది.. దాంతొ ఇప్పటివరకు ఇప్పటివరకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్?
కమల్ హాసన్ లోకేష్ కమగరాజ్ కాంబినేషన్ అనగానే విక్రమ్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. దానికితోడు విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ కూడా సినిమాలో నటించడం, సూర్య గెస్ట్ రోల్ లో రావడం.. ఇలా అన్ని అంశాలు కూడా విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేశాయి. ఇక తెలుగులో ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ లో రెండు రాష్ట్రాల్లో కూడా విక్రమ్ ను విడుదల చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అయితే విక్రమ్ సినిమా 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

18వ రోజు ఎంత వచ్చింది అంటే..
'విక్రమ్' సినిమా విడుదలకు ముందే మంచి హైప్ తో విడుదలైంది. ఇక ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చాయి. ఆ తరువాత మౌత్ టాక్ ద్వారా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. ఇక 18వ రోజూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ పరవాలేదు అనిపించే విధంగా వచ్చాయి. ఇక 17వ రోజు 44 లక్షల షేర్ అందుకున్న విక్రమ్ సినిమా 18వ రోజు మాత్రం కేవలం 18 లక్షల షేర్ రాబట్టింది. మిగతా తెలుగు సినిమాలకు పోటీగా ఈ రేంజ్ లో వసూళ్లు అందుకోవడం విశేషం.

టోటల్ 18 రోజుల కలెక్షన్స్
కమల్ హాసన్ 'విక్రమ్' ఆంద్రప్రదేశ్ తెలంగాణలో 18 రోజుల్లో అందుకున్న కలెక్షన్స్ ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 6.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.26 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.19 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 79 లక్షలు, గుంటూరులో రూ. 1.06 కోట్లు, కృష్ణాలో రూ. 1.18 కోట్లు, నెల్లూరులో రూ. 55 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 15.65 కోట్లు షేర్, రూ. 27.35 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్
ఏపీ తెలంగాణలో 18 రోజుల్లో వచ్చిన షేర్ రూ. 27.35 కోట్ల గ్రాస్ రాబట్టిన 'విక్రమ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగాను మంచి కలెక్షన్స్ అందుకుంది. తమిళనాడులో అత్యధికంగా 160.50 కోట్లు, కర్ణాటక 19.05 కోట్లు, కేరళ 35.30 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.95 కోట్లు, ఓవర్సీస్ లో 115.30 కోట్లు వీటితో కలిపి 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ సినిమా రూ రూ. 367.45 కోట్లు గ్రాస్, 182.90 కోట్ల షేర్ వసూలు సాదించింది.

ప్రాఫిట్స్ ఎంతంటే?
'విక్రమ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. తెలుగులో రూ. 7 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 7.50 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక ఇప్పటికే తెలుగులో రూ. 15.65 కోట్లు రావడంతో శ్రేష్ట్ మూవీస్ కు రూ. 8.15 కోట్ల ప్రాఫిట్స్ తో ముందుకి సాగుతోంది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే సినిమాకు 82 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం.

నెంబర్ వన్ రికార్డ్ బ్రేక్
కమల్ హాసన్ విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక తమిళనాడు 150 కోట్ల గ్రాస్ రావడం విశేషం. ఇది తమిళ రాష్ట్రంలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇంతకుముందు ఆ స్థానంలో బాహుబలి 2 సినిమా ఉండడం విశేషం. ఇక మొత్తానికి కమల్ హాసన్ అగ్ర స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications











