Vikram 19 Days Collections: బాక్సాఫీస్ హిట్ అంటే ఇలా ఉండాలి.. ప్రపంచవ్యాప్తంగా ఎంత వచ్చాయంటే?

విక్రమ్ సినిమాతో విశ్వనటుడు కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా.కోలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద విజయాన్ని అందుకోవడం విశేషం. ఈ విజయాన్ని కమల్ హాసన్ చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా కోసం కష్టపడిన వారికి ప్రత్యేకంగా ఖరీదైన కానుకలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ వద్ద మూడు వారంలో కూడా సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఇక 19వ రోజు ఎంత కలెక్ట్ చేసింది.. ఇప్పటివరకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

కమల్ హాసన్ గత సినిమాలతో అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా విక్రమ్ సినిమాపై ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్, సూర్య కూడా సినిమాలో నటించడంతో విడుదలకు పాజిటివ్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక తెలుగులో ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ లో రెండు రాష్ట్రాల్లో కూడా విక్రమ్ సినిమాను విడుదల చేశారు. ఇక వరల్డ్ వైడ్ గా విక్రమ్ 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

19వ రోజు వచ్చిన కలెక్షన్స్ '

19వ రోజు వచ్చిన కలెక్షన్స్ '

'విక్రమ్' సినిమాకు తెలుగులో మొదట ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వచ్చినప్పటికీ రెండవ రోజు నుంచి మౌత్ టాక్ ద్వారా వసూళ్లు పెరిగాయి. 19వ రోజూ ఆంధ్ర తెలంగాణలో కూడా కలెక్షన్స్ పరవాలేదు అనిపించే విధంగా వచ్చాయి. ఇక 18వ రోజు 18 లక్షల షేర్ అందుకున్న విక్రమ్ సినిమా 19వ రోజు మాత్రం కేవలం 15 లక్షల షేర్ రాబట్టింది. ఇతర తెలుగు సినిమాలకు పోటీగా ఈ రేంజ్ లో వసూళ్లు అందుకోవడం విశేషం.

మొత్తం 19 రోజుల కలెక్షన్స్

మొత్తం 19 రోజుల కలెక్షన్స్

కమల్ హాసన్ 'విక్రమ్' రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో అందుకున్న కలెక్షన్స్ ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 6.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.28 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 80 లక్షలు, గుంటూరులో రూ. 1.07 కోట్లు, కృష్ణాలో రూ. 1.20 కోట్లు, నెల్లూరులో రూ. 55 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 15.80 కోట్లు షేర్, రూ. 27.60 కోట్లు గ్రాస్ దక్కింది.

టోటల్ వరల్డ్ వైడ్ షేర్

టోటల్ వరల్డ్ వైడ్ షేర్

తెనుగు రాష్ట్రాల్లో 19 రోజుల్లో వచ్చిన షేర్ రూ. 27.60 కోట్ల గ్రాస్ రాబట్టిన 'విక్రమ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. తమిళనాడులో అత్యధికంగా 161.61బ్కోట్లు, కర్ణాటక 19.15 కోట్లు, కేరళ 35.55 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10.10 కోట్లు, ఓవర్సీస్ లో 116.20 కోట్లు వీటితో కలిపి 19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ సినిమా రూ రూ. 370.20 కోట్లు గ్రాస్, 184.15 కోట్ల షేర్ వసూలు సాదించింది.

 టోటల్ గా లాభాలు ఎంతంటే? '

టోటల్ గా లాభాలు ఎంతంటే? '

'విక్రమ్' మూవీ వరల్డ్ వైడ్ రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో రూ. 7 కోట్ల బిజినెస్ చేయగా రూ. 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక తెలుగులో 19 రోజుల్లో రూ. 15.80 కోట్లు రావడంతో శ్రేష్ట్ మూవీస్ కు రూ. 8.30 కోట్ల ప్రాఫిట్స్ తో ముందుకి సాగుతోంది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే సినిమాకు 84 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X