Vikram 1st Week Collections: కమల్ హాసన్ హవా.. నితిన్ ఇంటికి లాభాలు.. మొత్తం ఎంతంటే?
చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి కలెక్షన్స్ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కమల్ హాసన్ ఈ విజయాన్ని చాలా ఆనందం గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి 7 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ వీక్ మొత్తం లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

తెలుగులో మంచి బిజినెస్
ఈ సినిమాలో కమల్ హాసన్ మాత్రమే కాకుండా విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాసిల్, సూర్య ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక నితిన్ హోమ్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి తెలుగు రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఆంధ్రా, తెలంగాణలో విక్రమ్ రూ. 7 కోట్ల బిజినెస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల వరకూ వ్యాపారం జరిగింది.

7వ రోజు వచ్చిన కలెక్షన్స్
'విక్రమ్' మూవీకి 7వ రోజూ ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో రూ. 43 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 0.89 కోట్లు షేర్, రూ. 1.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టోటల్ 7 రోజుల కలెక్షన్స్
'విక్రమ్' మూవీ 7 రోజుల్లో మొత్తం అందుకున్న కలెక్షన్స్ నైజాంలో రూ. 4.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 57 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 80 లక్షలు, నెల్లూరులో రూ. 80 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 11.12 కోట్లు షేర్, రూ. 19.91 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్
తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో రూ. 11.12 కోట్లు రాబట్టిన 'విక్రమ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 7వ రోజు రూ. 8.60 కోట్లు షేర్ రాబట్టింది. వీటితో కలిపి ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 121.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 241.11 కోట్లు గ్రాస్ వసూలు సాదించింది.

లాభాల్లో విక్రమ్
'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక తెలుగులో రూ. 7 కోట్ల వ్యాపారం జరిగింది. అయితే 7 రోజుల్లోనే రూ. 140కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 11.12 కోట్లు రావడంతో విక్రమ్ తెలుగు లో రూ. 3.73 కోట్ల ప్రాఫిట్స్ తో ముందుకి సాగుతోంది.


Click it and Unblock the Notifications











