Vikram 9 Days Collections: కమల్ హాసన్ రెచ్చిపోతే ఇలా ఉంటుంది.. వరల్డ్ వైడ్ గా వచ్చిన ప్రాఫిట్స్ ఎంతంటే?
విశ్వనటుడు కమల్ హాసన్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ ను అందుకున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు సరికొత్త రికార్డుల తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చాలా కాలంగా వరుసగా అపజయాలు ఎదుర్కొంటున్న కమల్ హాసన్ మొత్తానికి విక్రమ్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక ఈ సినిమా తొమ్మిది రోజుల్లో ప్రపంచ అలాగే తెలుగులో పెట్టిన పెట్టుబడికి ఎంత లాభాలను అందించింది అనే వివరాల్లోకి వెళితే..

తెలుగులో హై డిమాండ్
కమల్ హాసన్ తో పాటు స్టార్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాసిల్ విక్రమ్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే సూర్య కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ స్టార్ క్యాస్ట్ తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా హక్కులను నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ దక్కించుకుంది. ఆంధ్రా, తెలంగాణలో విక్రమ్ రూ. 7 కోట్ల బిజినెస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల వరకూ వ్యాపారం జరిగింది.

9వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
'విక్రమ్' సినిమాకు 9వ రోజూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. శుక్రవారం కంటే కూడా శనివారం వసూళ్ళు కొంత పెరిగాయి. ఇక ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో రూ. 37 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. తెలంగాణ ఆంధ్రలో రూ. 0.83 కోట్లు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

టోటల్ 9 రోజుల కలెక్షన్స్
'విక్రమ్' తెలంగాణ ఆంధ్రలో 9 రోజుల్లో మొత్తం అందుకున్న కలెక్షన్స్ ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 5.34 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.80 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 93 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, గుంటూరులో రూ. 83 లక్షలు, కృష్ణాలో రూ. 90 లక్షలు, నెల్లూరులో రూ. 45 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 12.53 కోట్లు షేర్, రూ. 22.11 కోట్లు గ్రాస్ దక్కింది.

వరల్డ్ వైడ్ వచ్చిన షేర్
తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో రూ. 12.53 కోట్ల షేర్ రాబట్టిన 'విక్రమ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగాను భారీగా కలెక్షన్స్ అందుకుంది. తమిళనాడులో 110.25 కోట్లు, కర్ణాటక 16.90 కోట్లు, కేరళ 25.90కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.15కోట్లు, ఓవర్సీస్ లో 90.55కోట్లు వీటితో కలిపి 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ రూ. 241.11 కోట్లు గ్రాస్, 136.30 కోట్ల షేర్ వసూలు సాదించింది

ప్రాఫిట్స్ ఎంతంటే?
'విక్రమ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 100 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక తెలుగులో రూ. 7 కోట్ల వ్యాపారం జరిగింది. తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 12.53 కోట్లు రావడంతో విక్రమ్ తెలుగు లో రూ. 5.03 కోట్ల ప్రాఫిట్స్ తో ముందుకి సాగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటే సినిమాకు 40కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం


Click it and Unblock the Notifications











