ఎవరు నువ్వు ?: విక్రమ్ 'ఐ' తెలుగు టీజర్(వీడియో)

By Srikanya

హైదరాబాద్: విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఐ (తెలుగులో మనోహరుడు) చిత్రం ప్రారంభం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం చెన్నైలో విడుదల చేసిన ఈ సినిమా ఆడియో మంచి విజయం సాధించి సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది. శంకర్, విక్రమ్ సినిమాలకి తమిళం తర్వాత మళ్లీ అదేస్థాయిలో ఫ్యాన్ బేస్, మార్కెట్ వున్న ఏరియా తెలుగు పరిశ్రమ. అందుకే తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడం కోసం ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. అమీ జాక్సన్ ..ఎవరు నువ్వు...నీకేం కావాలి అంటూ చెప్పే డైలాగుతో ఈ టీజర్ వచ్చింది. ఆ టీజర్ ని మీరూ చూడండి...

త్వరలో హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు పాటల్ని విడుదల చేసేందుకు డైరెక్టర్ శంకర్, నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్‌లు ప్లాన్ చేస్తున్నారు. ఆర్నాల్డ్ తరహాలోనే ఈ ఫంక్షన్‌కి మరో హాలీవుడ్ స్టార్ జాకీచాన్ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 20వేల థియేటర్లలో ఐ మూవీ రిలీజవుతోంది. వెండితెరపై సాంకేతిక మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంటారు దర్శకుడు శంకర్‌. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ముగ్ధుడిని చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చిత్రాల్ని తీర్చిదిద్దుతుంటారు. విక్రమ్‌తో తీస్తున్న 'ఐ' కోసం పలు విదేశీ కంపెనీలతో కలసి పని చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. 'ఐ'లో విక్రమ్‌ సరసన అమీ జాక్సన్‌ నటించింది. శంకర్‌ దర్శకత్వం వహించారు.

 Vikram's new movie 'I' Telugu Trailer

ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌ కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకుడు. ఇటీవలే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో విక్రమ్‌ ధరించిన వేషాలు చూసి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు. తాజాగా మృగరాజు వేషంలో ఉన్న మరో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఇక ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందని చిత్ర వర్గాలు వెల్లడించినా..అసలు కథాంశమేమిటనే అంశాన్ని ఎవరూ ఊహించలేకపోతున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్ లో మనిషి, మృగరూపం సమ్మిళితంగా వున్న విక్రమ్ లుక్ గగుర్పాటును కలిగించేలా వుంది. ఈ ట్రైలర్‌లో కూడా విక్రమ్ కోపంతో రగిలిపోతూ ముందుకు పొడుచుకు వచ్చిన కోర దంతాలతో కనిపించారు. దీంతో ఎక్కడ చూసినా ఐ ట్రైలర్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.

ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర రెండు భిన్న పార్శాల్లో సాగుతుందని తెలుస్తోంది. థ్రిల్, ఫాంటసీ మేళవించిన ఈ చిత్రంలో సమకాలీన అంశాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్ని ప్రస్తావించారని చెన్నై సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రూ.150 కోట్ల పైచిలుకు వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. విదేశీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X