twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikram Vedha day 1 collections ఉత్తరాదిలో నిరాశజనకంగా.. కుర్ర హీరో కలెక్షన్లను దాటలేకపోయిన హృతిక్

    |

    బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం విక్రమ్ వేద బాక్సాఫీస్ యాత్రను భారీగానే మొదలుపెట్టింది. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగానే విక్రమ్ వేద చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. విక్రమ్ వేద సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎంత సాధించిందంటే?

    తమిళ రీమేక్‌తో విక్రమ్ వేద

    తమిళ రీమేక్‌తో విక్రమ్ వేద

    విక్రమ్ వేద చిత్రం తమిళంలో చిత్రానికి రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి, ఆర్ మాధవన్ నటించిన విక్రమ్ వేద చిత్రాన్ని అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే విజయ్ సేతుపతి, ఆర్ మాధవన్ రేంజ్‌లోనే హృతిక్, సైఫ్ నటించారని బాలీవుడ్ సినీ క్రిటిక్ తమ రివ్యూలో ప్రస్తావించడం గమనార్హం.

    భారీగా థియేట్రికల్ రిలీజ్

    భారీగా థియేట్రికల్ రిలీజ్

    విక్రమ్ వేద చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో 4000 థియేటర్లలో, ఓవర్సీసీస్‌లో 1650 థియేటర్లు, ప్రపంచవ్యాప్తంగా 5650 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో అత్యధిక థియేటర్లలో రిలీజైన చిత్రంగా విక్రమ్ వేద ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.

    ఉత్తరాదిలో నిరాశజనకంగానే

    ఉత్తరాదిలో నిరాశజనకంగానే

    ఇక విక్రమ్ వేద చిత్రం ఉత్తరాదిలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ప్రేక్షకులను భారీగా రప్పించడంలో విఫలమైందనే కామెంట్ వినిపిస్తున్నది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా సగటున 30 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. దేశంలోని ప్రధాన నగరాలు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా లాంటి ప్రదేశాల్లో అతి తక్కువగా వసూళ్లు నమోదు చేసింది.

    తొలి రోజు విక్రమ్ వేద కలెక్షన్లు

    తొలి రోజు విక్రమ్ వేద కలెక్షన్లు

    విక్రమ్ వేద చిత్రం తొలి రోజున సానుకూలమైన వసూళ్లను రాబట్టింది. తొలి రోజున దేశవ్యాప్తంగా 10.35 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 13 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసింది. అయితే ఈ చిత్రం ట్రేడ్ నిపుణులు అంచనాలకు దిగువన కలెక్షన్లను రాబట్టిందనే టాక్ వినిపిస్తున్నది.

    భూల్ భులయ్యా కంటే తక్కువగానే

    భూల్ భులయ్యా కంటే తక్కువగానే

    ఇటీవల రిలీజైన కార్తీక్ ఆర్యన్ సినిమా భూల్ భులయ్యా చిత్రానికి సంబంధించిన తొలి రోజు వసూళ్లను అధిగమించలేకపోయింది. భూల్ భులయ్యా చిత్రం తొలి రోజున 14.11 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టింది. అయితే పాజిటివ్ రివ్యూల కారణంగా వారాంతంలో సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందనే ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    English summary
    Hrithik Roshan and Saif Ali khan's Vikram Veda movie started good not but, Its not impressive. This movie collected 13 crores worldwide on its first day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X