పట్టు దొరకని విక్రమార్కుడు
రాజమౌళి బ్రాండ్ మాస్ మసాలా చిత్రం విక్రమార్కుడుకు ఇంకా మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. యావరేజికి ఎక్కువగా, హిట్‌కు తక్కువగా ఉన్న ఈ సినిమా బి,సి సెంటర్లలో ఓ మోస్తరుగా నడుస్తున్నా, ఎ సెంటర్లలో వెలవెలబోతోంది. కథ వాస్తవానికి దూరంగా ఉండడంతో సినిమా కొంత భారంగా ఉంది. రవితేజ రెండు పాత్రలను చక్కగా పోషించినా కథ బలహీనంగా ఉండడం సినిమాను దెబ్బతీసింది. సందట్లో సడేమియాలాగా ఇవివి సినిమా కితకితలు బాగా పుంజుకుంది. ఇది చిన్న సినిమా అయినా పెద్ద వసూళ్ళు చూపిస్తోంది. శేఖర్ కమ్ముల గోదావరి గలగలా సాగిపోతూ నిలకడగా కలెక్షన్లను కురిపిస్తోంది. ఇక మహేష్ బాబు -పూరీ జగన్నాధ్‌ల పోకిరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రాబట్టని కలెక్షన్ల రేంజికి సినిమా చేరిపోయింది. ఈ సినిమా కొన్ని సెంటర్లలో 200 రోజులు ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి హేమాహేమీలు ఈ సినిమా మెచ్చుకున్నారన్న వార్తలు రావడంతో సినిమాలు పెద్దగా చూడని వారు కూడా పోకిరి బాట పడుతున్నారు.


Click it and Unblock the Notifications