Vikrant Rona day 2 collections 50 కోట్ల క్లబ్‌పై కన్నేసిన కిచ్చ సుదీప్.. కేజీఎఫ్2 తర్వాత రికార్డుస్థాయిలో..!
కన్నడ సినిమా రంగంలో భారీ బడ్జెట్ చిత్రంగా సుదీప్ కిచ్చ నటించిన విక్రాంత్ రోణ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ సినిమా రంగంలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక సాంకేతికత, గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా అంచనాలను చేరుకోలేదనే విషయం ట్రేడ్ వర్గాల్లో స్పష్టమైంది. ఈ క్రమంలో ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనాలు ఎలా ఉన్నాయంటే..

ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు అక్యుపెన్సీ
మిక్స్‌డ్ టాక్ అందుకొన్న విక్రాంత్ రోణ చిత్రం రెండో రోజు కూడా భారీ అక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో భారీగా అక్యుపెన్సీ నమోదు అయింది. బెంగళూరులో రెండో రోజు 118 షోలు హౌస్‌ఫుల్ కలెక్షన్లు నమోదు చేసింది. కేజీఎఫ్2 సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా విక్రాంత్ రోణ నిలిచింది.

ఉత్తరాదిలో విక్రాంత్ రోణకు ఆదరణ
ఉత్తరాదిలో తొలి రోజు కంటే రెండో రోజు 300 శాతం మేరకు కలెక్షన్లు పెరిగాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వారం రిలీజైన బాలీవుడ్ చిత్రాల కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయాయి. దాంతో విక్రాంత్ రోణ చిత్రానికి కలెక్షన్లు పెరగడానికి అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తొలి రోజు 26 కోట్లకుపైగా
సుదీప్ కిచ్చ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం విక్రాంత్ రోణ రికార్డు సొంతం చేసుకొన్నది. ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 26.49 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా వసూళ్ల పరంగా అంచనాలు మించింది అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో నెలకొన్నది.

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు
ఇక తొలి రోజు విక్రాంత్ రోణ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో తొలి రోజు 18.33 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకుపైగా గ్రాస్, తమిళనాడులో 81 లక్షలు, కేరళలో 16 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 2.42 కోట్లు, ఓవర్సీస్‌లో 2.67 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 26 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.

రెండో రోజు కూడా 25 కోట్ల గ్రాస్?
విక్రాంత్ రోణకు దేశవ్యాప్తంగా సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగులో రిలీజైన చిత్రాలు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో విక్రాంత్ రోణకు ఆదరణ పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రం రెండో రోజున మరో 25 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విక్రాంత్ రోణ లాభాల్లోకి రావాలంటే?
విక్రాంత్ రోణ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ మూవీని 95 కోట్లతో తెరకెక్కించారు. ఈ సినిమా తొలి రోజు 26 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు మరో 25 కోట్ల రూపాయల వసూళ్లను అంచనా వేస్తున్నారు. ఒకవేళ రెండో రోజు 50 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తే రికార్డుగానే చెప్పుకోవాలి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. మరో 70 కోట్లకుపైగా రాబట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











