Vikrant Rona day 3 collections.. కిచ్చ సుదీప్ మూవీకి ఎదురుదెబ్బ.. కర్ణాటకలో తప్ప అంతటా నిరాశే
కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప నటించిన విక్రాంత్ రోణ ప్యాన్ ఇండియా మూవీగా రిలీజైంది. జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోతున్నది. గత రెండు రోజుల్లో 20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం మూడో రోజున పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విక్రాంత్ రోణ చిత్రం మూడో రోజు ఎంత వసూలు సాధించిందంటే..

తొలి రెండు రోజుల్లో
భారీ అంచనాలతో రిలీజైన విక్రాంత్ రోణ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కర్ణాటకలో 14 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.9 కోట్లు, తమిళనాడు, కేరళలో 1.20 కోట్లు, ఉత్తర భారతంలో 1.9 కోట్లు వసూలు చేసింది.

హిందీలో షంషేరా కారణంగా
అయితే విక్రాంత్ రోణ సినిమాకు మూడో రోజున ఉత్తరాదిలో రణ్‌బీర్ కపూర్ నటించిన షంషేరా చిత్రం భారీ పోటీగా నిలిచింది. ఉత్తరాదిలో షంషేరా 5250 స్క్రీన్లలో రిలీజైతే.. విక్రాంత్ రోణ 2500 స్క్రీన్లలో విడుదలైంది. అయితే తొలి రోజున కోటి రూపాయలు, రెండో రోజున 70 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

మూడో రోజున ఆక్యుపెన్సీ
అయితే మూడో రోజున విక్రాంత్ రోణ చిత్రం భారీగా డ్రాప్ అయింది. తొలి రోజు కలెక్షన్లు, ఆక్యుపెన్సీతో పోల్చుకొంటే.. ఊహించని విధంగా క్షీణించాయి. ఢిల్లీ 5 శాతం ఆక్యుపెన్సీ, బెంగళూరులో 30 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం అక్యుపెన్సీ కనిపించింది. అయితే చెన్నైలో భారీగా స్పందనను రాబట్టడం విశేషంగా మారింది.

ఇండియావైడ్‌గా మూడో రోజు
ఇక విక్రాంత్ రోణ మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. కర్ణాటకలో 9 కోట్ల గ్రాస్ వసూళ్లు, ఏపీ, నైజాంలో 1 కోటి, తమిళనాడులో 60 లక్షలు, కేరళలో 10 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 2 కోట్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

మూడో రోజున ప్రపంచవ్యాప్తంగా
గత రెండు రోజుల్లో విక్రాంత్ రోణ చిత్రం 20 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే మూడో రోజున ప్రపంచవ్యాప్తంగా మరో 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ ఇంకా మెరుగ్గా వసూళ్లు ఉంటే.. మూడు రోజుల్లో 35 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయడానికి స్కోప్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

విక్రాంత్ రోణ ముందు భారీ లక్ష్యం
విక్రాంత్ రోణ మూవీని సుమారు 95 కోట్లతో తెరకెక్కించారు. కరోనా సమయంలో భారీగా సెట్లు వేసి అన్నపూర్ణ స్టూడియోలో సినిమాను ఫినిష్ చేశారు. అయితే సినిమా తొలి రెండు రోజుల్లో 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా మరో 10 కోట్లు రాబడితే.. రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించడానికి భారీ మొత్తాలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











