కేక పెట్టిస్తోన ‘విల్లా’(పిజ్జా-2) కలెక్షన్స్
హైదరాబాద్ : గుడ్‌సినిమా గ్రూప్, స్టూడియోసౌత్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులో నిర్మిస్తున్న చిత్రం 'విల్లా'(పిజ్జా-2). ఈ చిత్రం తమిళంలో ఈనెల 14న తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో నవంబరు 16న విడుదల చేసారు నిర్మాతలు. పిజ్జా చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం మొదటి వారంలో కోటి రూపాయలు వసూలు చేసింది.
దీపన్.ఆర్ దర్శకుడు. గుడ్‌ఫ్రెండ్స్ ఈ చిత్రానికి నిర్మాతలు. అశోక్, సంచితాశెట్టి మెయిన్ లీడ్ పోషిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''గుడ్‌సినిమా గ్రూప్ సంస్థలో వస్తున్న మరో కమర్షియల్ చిత్రమిది. పిజ్జాకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో విల్లా పేరుతో విడుదల చేసినందుకు ఆనందంగాఉంది. తమిళంలో ఈసినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది''అన్నారు.
చిత్ర దర్శకుడు దీపన్ మాట్లాడుతూ- తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న పిజ్జాకు సీక్వెల్‌గా రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయని, ప్రేక్షకులను ఏ మాత్రం నిరుత్సాహపర్చకుండా ఈ చిత్రం వారికి నచ్చుతుందని తెలిపారు. సీక్వెల్‌గా రూ పొందించిన 'విల్లా' అందరికీ నచ్చేలా రూపొందిందని, పిజ్జా చిత్రంకన్న ఎక్కు వ విజయాన్ని సాధిస్తుందని చిత్ర హీరో అశోక్ సెల్వన్ తెలిపారు.
ఆర్తీ అనే పాత్రతో తెలుగు, తమిళ భాషల్లో తాను చేసిన ఈ చిత్రం ఒకేసారి విడుదల కావడం సంతోషంగా ఉందని హీరోయిన్ సంచితా శెట్టి తెలిపారు. తమిళం లో తాను నిర్మించిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతమవ్వాలని తమిళ నిర్మాత సి.వి.కుమార్ తెలిపారు. చిన్న చిత్రాలన్నీ ఘనవిజయం సాధిస్తున్న ఈ ట్రెండ్‌లో శ్రీనివాసమూర్తితో అసోసియేట్ అయ్యి తమ బ్యానర్ ద్వారా విడుదలఅయిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆనందాన్నిస్తుందని దర్శకుడు మారుతి తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: దీపక్ కుమారపతి, ఎడిటింగ్: లియో జాన్ పాల్.ఎం., ఆర్ట్: మాయన్.ఎల, సౌండ్ ఎఫెక్ట్స్: అరుణ్ శీను, స్టంట్స్: బిల్లా జగన్.


Click it and Unblock the Notifications












