VBVK day 1 Collecitons కిరణ్ అబ్బవరం కెరీర్ బెస్ట్! వినరో భాగ్యం విష్ణు కథ కలెక్షన్లు
రాజా వారు రాణి వారు, ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకొన్న యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యం విష్ణు కథ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 18వ తేదీన రిలీజైంది. కశ్మీరా పరదేశీ, మురళీ శర్మ, పమ్మీ సాయి తదితరులు నటించిన ఈ సినిమా తొలి ఆట నుంచే మంచి రెస్సాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో
కిరణ్ అబ్బవరం ఆరంభంలో విజయాలతో కెరీర్ ప్రారంభించారు. అయితే మధ్యలో చేసిన సినిమాలు నిరాశపరిచాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో హిట్ కొట్టాల్సిందేననే పరిస్థితి ఆయనకు ఎదురైంది. దాంతో వినరో భాగ్యం విష్ణు కథ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొన్నారు. ఈ సినిమాను భారీ ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచారు.

రిలీజ్‌కు ముందే ప్రీమియర్లతో
ఇక ప్రమోషన్ స్ట్రాటజీలో భాగంగా నిర్మాత బన్నీ వాసు, హీరో కిరణ్ అబ్బవరం సినిమాపై భారీ రిస్క్ తీసుకొన్నారు. కంటెంట్‌పై నమ్మకం ఉండటంతో వినరో భాగ్యం విష్ణు కథ సినిమా ప్రీమియర్‌ను ఒకరోజు ముందే ప్రదర్శించారు. ఒకట్రెండు షోలతో మొదలుపెట్టి మొత్తం 30 షోలు రిలీజ్‌కు ముందే ప్రదర్శించారు. దాంతో తొలి రోజు సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది.

బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంతంటే?
ఇక వినరో భాగ్యం విష్ణు కథ ప్రీ రిలిజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా కనీసం 4.5 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 4.5గా అంచనా వేశారు.

వినరో భాగ్యం థియేటర్ కౌంట్
వినరో భాగ్యం విష్ణు కథ సినిమాకు భారీ బజ్ క్రియేట్ కావడంతో ఓవర్సీస్లోను, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఇప్పటి వరకు విడుదల చేయని రేంజ్‌లో స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాదాపు ఈ సినిమాను 300 స్క్రీన్లకుపైగా తెలుగు రాష్ట్రాల్లో, 92 లొకేషన్లలో ఓవర్సీస్ రిలీజ్ చేశారు.

VBVK తొలి రోజు కలెక్షన్లు
ఇక వినరో భాగ్యం విష్ణు కథ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో కలిపి ఈ సినిమా 1.5 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. కడపటి వార్తలు అందే సరికి ఈ సినిమా 92 లొకేషన్లలో 24K అమెరికన్ డాలర్లు అంటే సుమారు 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా తొలి రోజు 2 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే చాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











