Don't Miss!
- News ఓటర్లను బెదిరించిన డీకేపై ఎఫ్ఐఆర్, అయ్యా అలా అనలేదని హైకోర్టులో పిటిషన్, అపార్ట్ మెంట్ లో ?
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘వినయ విధేయ రామ’ ఖతం అన్నారు.. కానీ రికార్డు వసూళ్లు.. కుమ్మేస్తున్న రాంచరణ్
రంగస్థలం తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం రిలీజ్ తర్వాత రెండు రోజుల్లో భారీ కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు రికార్డుస్థాయి కలెక్షన్లు వసూలు చేయడం రాంచరణ్ స్టామినాకు అద్దం పట్టింది. బోయపాటి శ్రీను దర్వకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు పెదవి విరిచారు. అయినా సంక్రాంతి బరిలో భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఓ రికార్డు నెలకొల్పింది. వివరాల్లోకి వెళితే..
నైజాంలో భారీ వసూళ్లు
వినయ విధేయ రామ చిత్రం తొలిరోజున నైజాంలో భారీ కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం తొలిరోజున నైజాంలో రూ.5.08 కోట్ల గ్రాస్‌ను, రూ.3 కోట్లకుపైగా షేర్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రెండో రోజు ఈ చిత్రం రూ. 6.79 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
వినయ విధేయ రామ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సీడెడ్‌లో నాన్ బాహుబలి రికార్డు
సీడెడ్‌లో వినయ విధేయ రామ నాన్ బాహుబలి రికార్డులను తిరుగరాసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి రోజున రూ.7.15 కోట్లు, రెండో రోజున రూ.7.70 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో ఈ వసూళ్లను ఆల్ టైమ్ రికార్డులుగా పేర్కొంటున్నారు.
ఆంధ్రాలో కలెక్షన్ల హంగామా
ఉత్తరాంధ్రలో ఈ చిత్రం తొలి రోజున రూ.2.45 కోట్లు, రెండో రోజున రూ.3.05 కోట్లు వసూలు చేయడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాలో తొలి రోజున రూ.2.05 కోట్లు, రెండో రోజున రూ.2.32 కోట్లు వసూలు చేసింది. పశ్చిమ గోదావరిలో రూ.1.83 కోట్లు, రూ. 2.08 కోట్లు కలెక్ట్ చేసింది.
మిగితా ప్రాంతాల్లో
ఇక గుంటూరులో తొలి రోజున రూ.2.05 కోట్లు, రెండో రోజున రూ.2.32 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.51 కోట్లు, రెండో రోజున రూ.1.80 కోట్లు రాబట్టింది. నెల్లూరులో రూ.1.69 కోట్లు, రెండో రోజున రూ.1.85 కోట్లు వసూలు చేసింది. కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రం రూ.8.50 కోట్లు వసూలు చేసింది.
ఓవర్సీస్ మార్కెట్లో
యూఎస్ మార్కెట్లో వినయ విధేయ రామ కలెక్షన్లు జోరుగానే ఉన్నాయి. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1.5 కోట్లకుపైగా రాబట్టింది. ఓవరాల్‌గా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.33 కోట్లకుపైగా, కర్ణాటకలో రూ.4 కోట్లు, ఓవర్సీస్లో 2 కోట్లు వసూలు చేసింది.
డిస్టిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే
వినయ విధేయ రామ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.92.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.70 కోట్లకుపైగా గ్రాస్, రూ.40 కోట్లకుపైగా షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.50 కోట్లకుపైనే వసూలు చేయాల్సి ఉంటుంది.