twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వినయ విధేయ రామ' తాజా వసూళ్లు.. నష్టం లెక్క తేలిందా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను తొలి కాంబినేషన్ లో రూపొందిన వినయ విధేయ రామ చిత్రం భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా అలరిస్తుంది అనుకున్న వినయ విధేయ రామ చిత్రం అంచనాలని అందుకోలేకపోయింది. బోయపాటి శ్రీను ఈసారి మ్యాజిక్ చేయలేకపోయారు. కానీ సంక్రాంతి సీజన్, రామచరణ్ స్టామినాతో తొలి వారంలో ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ తాజాగా ఈ చిత్ర వసూళ్లు బాగా తగ్గుముఖం పడుతున్నాయి. 9 రోజులలో వినయ విధేయ రామ చిత్రానికి నమోదైన వసూళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

     కంప్లీట్‌గా కమర్షియల్ ఎలిమెంట్స్

    కంప్లీట్‌గా కమర్షియల్ ఎలిమెంట్స్

    వినయ విధేయ రామ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి పూర్తిగా కమర్షియల్ అంశాలతో రూపొందించారు. కానీ చిత్రానికి అవసరమైన బలమైన కథలేకపోవడంతో తొలి షో నుంచే డివైడ్ టాక్ మొదలయింది. అయినా కూడా ఆరంభ వసూళ్లు అదిరాయి. రాంచరణ్ స్టామినాకు సంక్రాంతి సీజన్ కలసి రావడంతో తొలి వారంలోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల షేర్ రాబట్టింది. కానీ చిత్ర విజయానికి ఇది సరిపోదు.

    రెండవ వారంలో తగ్గుముఖం

    రెండవ వారంలో తగ్గుముఖం

    రెండవ వారంలో వినయ విధేయ రామ చిత్ర వసూళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. 9 రోజుల్లో ఈ చిత్రం ఈ చిత్ర షేర్ ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్లకు దాటింది. రాబోవు రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ సేవ్ అయ్యే వసూళ్లు నమోదయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనితో చాలా ప్రాంతాల్లో బయ్యర్లు భారీ నష్టాలు ఎదుర్కోబోతున్నట్లు ట్రెడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    <strong>సేఫ్ జోన్లోకి ‘వినయ విధేయ రామ'.. ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ రిపోర్ట్.. బోయపాటి స్టామినా ఇదే</strong>సేఫ్ జోన్లోకి ‘వినయ విధేయ రామ'.. ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ రిపోర్ట్.. బోయపాటి స్టామినా ఇదే

    కొన్ని ప్రాంతాల్లో మాత్రమే

    కొన్ని ప్రాంతాల్లో మాత్రమే

    ఇక సీడెడ్, నెల్లూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో వినయ విధేయ రామ చిత్ర బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో ఈ చిత్రానికి మంచివసూళ్లు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలో 9 వరోజు ఈ చిత్రం 42 లక్షల షేర్ సాధించింది. 9వ రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది.

    నష్టం లెక్క ఎంతంటే

    నష్టం లెక్క ఎంతంటే

    వినయ విధేయ రామ చిత్రానికి 92 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం దాదాపు 25 కోట్ల వరకు నష్టాలు చవిచూసే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వీకెండ్ వసూళ్ళని బట్టి వినయ విధేయ రామ చిత్ర వసూళ్ళలో మరింత క్లారిటీ వస్తుంది. రాంచరణ్, కైరా అద్వానీ ఈ చిత్రంలో జంటగా నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించాడు. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటించారు.

    English summary
    Vinaya Vidheya Rama 9 days Box Office Collections report
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X