twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వినయ విధేయ రామ’ క్లోజింగ్ కలెక్షన్స్... ఎంత నష్టం అంటే?

    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' చిత్రం బాక్సాపీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. సినిమాకు తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ... బి, సి సెంటర్లలో కాస్త ఆశాజనకమైన ఫలితాలను రాబట్టింది.

    మాస్ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా బోయాపాటి.. రామ్ చరణ్‌తో చేయించిన టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్ కొంత మేరకు సినిమాను ప్లస్ అయ్యాయి. అయితే ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తేవడంలో విఫలమైంది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం బిజినెస్ ముగిసిన నేపథ్యంలో... ఇప్పటి వరకు ఎంత షేర్ రాబట్టిందో చూద్దాం.

    బిజినెస్ క్లోజ్- వరల్డ్ వైడ్ షేర్ ఎంతంటే?

    బిజినెస్ క్లోజ్- వరల్డ్ వైడ్ షేర్ ఎంతంటే?

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ‘వినయ విధేయ రామ' చిత్రం ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 62.85 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఇంత భారీ షేర్ వసూలైనప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు బయటపడలేక పోయారు.

    ఎంత నష్టం ఏర్పడిదంటే..

    ఎంత నష్టం ఏర్పడిదంటే..

    ‘వినయ విధేయ రామ' థియేట్రికల్ రైట్స్ రూ. 92 కోట్లకు అమ్మారు. అయితే వారు పెట్టిన పెట్టుబడిలో కేవలం 68 శాతం ( రూ. 62.85 కోట్లు) మాత్రమే వసూలైంది. దాదాపు 32 శాతం (రూ. 30 కోట్లు) నష్టపోయినట్లు తెలుస్తోంది.

    ఏరియా వైజ్ షేర్

    ఏరియా వైజ్ షేర్

    నైజాం: రూ. 12.60 కోట్లు, సీడెడ్ రూ. 11.98 కోట్లు, నెల్లూరు రూ. 2.90 కోట్లు, కృష్ణ రూ. 3.77 కోట్లు, గుంటూరు రూ. 6.40 కోట్లు, వైజాగ్ రూ. 8.30 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 5.30 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 4.35 కోట్లు, కర్నాటక రూ. 5.75 కోట్లు, ఓవర్సీస్ రూ. 1.50 కోట్ల షేర్ వసూలు చేసింది.

    రామ్ చరణ్ స్టామినా

    రామ్ చరణ్ స్టామినా

    అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ. 62.85 కోట్ల షేర్ రాబట్టడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రామ్ చరణ్ సినిమా స్టామినా రంగస్థలం తర్వాత మరింత పెరిగిందని, సినిమా బావుండి ఉంటే మంచి లాభాలు వచ్చేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    సంక్రాంతి సినిమాలో 2వ స్థానం

    సంక్రాంతి సినిమాలో 2వ స్థానం

    సంక్రాంతికి తెలుగులో 3 సినిమాలు విడుదలవ్వగా.... ‘వినయ విధేయ రామ' 2వ స్థానం దక్కించుకుంది. సూపర్ హిట్ టాక్‌తో ఎఫ్ 2 మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వినయ విధేయ రామ్, ఎన్టీఆర్-కథానాయకుడు చిత్రాలు నిలిచాయి.

    English summary
    Ram Charan's Vinaya Vidheya Rama collected a share of Rs.62.85 crores at the end of its full run world wide. Vinaya Vidheya Rama directed by Boyapati Srinu. The film stars Ram Charan and Kiara Advani in the lead roles. Vivek Oberoi stars as the antagonist while Prashanth, Sneha, and Aryan Rajesh appear in pivotal roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X