Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
తెలుగు రాష్ట్రాల్లో ‘వినయ విధేయ’ షాకింగ్ కలెక్షన్లు.. ఫ్లాప్ టాక్‌లోనూ రాంచరణ్ రచ్చ
సంక్రాంతి బరి దూకిన మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు వినయ విధేయ రామ చేదు అనుభవాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు నుంచే బ్యాడ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ప్రతికూలమైన టాక్ నేపథ్యంలో కూడా వినయ విధేయ రామ భారీ కలెక్షన్లు రాబట్టడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
వన్ సైడ్ ఫ్లాప్ టాక్‌తో
తొలి ఆట నుంచే వినయ విధేయ రామకు వన్‌సైడ్ ఫ్లాప్ టాక్ వచ్చింది. రంగస్థలం తర్వాత వచ్చిన ఈ చిత్రాన్ని సాధారణ ప్రేక్షకులను పక్కన పెడితే మెగా అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. దాంతో రెండో రోజు నుంచే సినిమాకు ఆదరణ కరువైంది.
రాంచరణ్ సత్తా అంటే ఇదే
వినయ విధేయ రామ సినిమాకు ఓ వైపు ఫ్లాప్ టాక్ విజృంభిస్తే మరో పక్క కలెక్షన్లు బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.55 కోట్లు సాధించింది. దాంతో రాంచరణ్ సత్తా ఎంటో బాక్సాఫీస్‌కు స్పష్టమైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంత నష్టమంటే
తెలుగు రాష్ట్రాల్లో వినయ విధేయ రామ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.72 కోట్లకు అమ్ముడుపోయాయి. అయితే ఈ సినిమా మొత్తంగా ఆంధ్రా, తెలంగాణాల్లో రూ. 55.4 కోట్లు రాబట్టింది. దాంతో ఓవరాల్‌గా 17 కోట్ల నష్టంతో బిజినెస్ ముగిసింది.
ప్రాంతాల వారీగా వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో వినయ విధేయ రామ సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం రూ.12 కోట్లు, సీడెడ్ రూ.11.2 కోట్లు, గుంటూరు రూ.6 కోట్లు, నెల్లూరు రూ.2.7 కోట్లు, వైజాగ్ రూ.6.8 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.3.8 కోట్లు, తూర్పు రూ.4.6 కోట్లు, కృష్ణా రూ.3.4 కోట్లు వసూలు చేసింది.