సేఫ్ జోన్లోకి ‘వినయ విధేయ రామ’.. ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ రిపోర్ట్.. బోయపాటి స్టామినా ఇదే

Recommended Video

Vinaya Vidheya Rama First Week Box Office Collections | Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' గురువారంతో బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ... బి,సి సెంటర్లలో మంచి వసూళ్లు సాధిస్తూ మాస్ హిట్‌గా నిలిచింది.

'రంగస్థలం' సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడం... బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో రిలీజ్ ముందే రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి సంక్రాంతి మూవీ తొలివారం ఎంత వసూలు చేసింది. గ్రాస్, షేర్ నెంబర్స్ ఎక్కడి వరకు రీచ్ అయ్యాయో చూద్దాం.

బోయపాటి-చరణ్ కాంబినేషన్ స్టామినా

బోయపాటి-చరణ్ కాంబినేషన్ స్టామినా

బోయపాటి సినిమా అంటేనే మాస్ ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజిలో ఉంటాయి. ఆయన యాక్షన్ సబ్జెక్టుకు రామ్ చరణ్ లాంటి మెగా పవర్ తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగిన విధంగానే ‘వినయ విధేయ రామ' తొలి వారంరూ. 82.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

బి, సి సెంటర్లలో కుమ్మేస్తోంది

బి, సి సెంటర్లలో కుమ్మేస్తోంది

విడుదల ముందు ఏ అంచనాలనైతే క్రియేట్ చేసిందో ఆ అంచనాలకు ఈ చిత్రం చేరువైందనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్రం బి, సి సెంటర్లలో కుమ్మేస్తోంది. పండగ తర్వాత కూడా నైజాం, సీడెడ్, ఆంధ్ర ప్రాంతాల్లో మంచి షేర్ వసూలు చేసింది.

తొలివారం షేర్ ఏరియా వైజ్

తొలివారం షేర్ ఏరియా వైజ్

తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా 56.5 కోట్లు షేర్ వసూలైంది. నైజాంలో రూ. 12.09 కోట్లు, ఆంధ్రా ఏరియాలో రూ. 27. 07 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 10.94 కోట్లు, కర్నాటకలో రూ. 5.12 కోట్లు, యూఎస్ఏలో రూ. 60 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 68 లక్షల షేర్ రాబట్టింది.

డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లో ఉన్నట్లేనా?

డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లో ఉన్నట్లేనా?

ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 90 కోట్లకు అమ్ముడవ్వగా... తొలి వారం 56.5 కోట్లు షేర్ అంటే దాదాపు 62.8 శాతం రికవరీ అయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లో ఉన్నట్లే అంటున్నారు విశ్లేషకులు.

వినయ విధేయ రామ

వినయ విధేయ రామ

రామ్ చరణ్, కైరా జంటగా నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఈ సినిమాలోని యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ సీన్స్ మంచి స్పందన వస్తోంది. బోయపాటి స్టామినాకు తగ్గట్టుగా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ తోడవ్వడంతో మాస్ హిట్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X