బాబాయ్ బాలయ్యేకాదు...అబ్బాయి ఎన్టీఆర్ కూడా అదే రోజు

By Srikanya

హైదరాబాద్: ఈ వినాయక చవితి తెలుగు సినీ అభిమానులకు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ పండుగ రోజుని పురస్కరించుకుని సినీ సంబరాలు జోరుగానే ఉండబోతున్నాయి. ఓ ప్రక్క బాబాయ్‌ నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్‌'లోని ఓ పాటని ఫ్యాన్స్ కు కానుకగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అబ్బాయ్‌ ఈ పండగను మరింత స్పెషల్‌ చేయబోతున్నాడు.

ఈనెల 17న వినాయక చవితి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. ఆ రోజే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడ ఎన్టీఆర్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. దాదాపు మూడొంతుల షూటింగ్‌ అక్కడే జరగనుంది.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం కోసం 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. 'దండయాత్ర', 'అభిరామ్‌'లు కూడా చర్చకు వచ్చాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్‌ దర్శకుడు.

Vinayaka Chaviti Special: Balakrishna,Ntr on same date

'టెంపర్' హిట్ తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ ఉత్సాహంగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం మరిన్ని విశేషాలకు వస్తే...

ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం వచ్చే క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రి బిజినెస్ క్రేజీ రేట్లతో క్లోజ్ అయిపోయినట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా రీసెంట్ గా అమ్ముడయినట్లు తెలుస్తోంది. టాక్స్ మొత్తం తో కలిపి 10.5 కోట్లకు (చెల్లించిన మొత్తం 9 కోట్లు) తో జెమినీ ఛానెల్ వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ చిత్రం నిమిత్తం దర్శకుడు సుకుమార్ ప్రత్యేకమైన బైక్ ని డిజైన్ చేయించారు. ఈ బైక్ మీద ఎన్టీఆర్ ఈ చిత్రంలో తిరుగుతూంటారు. శ్రీమంతుడులో సైకిల్ మీద మహేష్ తిరుగుతూ క్రేజ్ వచ్చినట్లే ఈ బైక్ మీద ఎన్టీఆర్ తిరుగుతూంటే సూపర్ గా ఉంటుందని చెప్తున్నారు.

అలాగే.. ఈ చిత్రం కొన్ని కొత్త విషయాలు బయిటకు వచ్చాయి. ఈ చిత్రానికి 'నాన్నకు..ప్రేమతో' టైటిల్ నే ఫైనలైజ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు అభిరామ్. అయితే ఇదే ఖరారు అని చెప్పలేం. ఇవి ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారంలో ఉన్న విషయాలు మాత్రమే.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X