ఈ వారం జాబిలమ్మ,టెర్రర్,సమ్మక్క సారక్క మహత్యం,వినాయకుడు చిత్రాలు రిలీజయ్యాయి. అయితే ఒక్క వినాయుకుడు మాత్రమే విజయం సాధించింది. ఈ రొమాంటిక్ కామిడీనే మల్టిఫ్లెక్స్,ఎ సెంటర్ల ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక అంతకు ముందు వారం రిలీజయిన ఆవకాయ బిర్యాని,సూర్య సన్నాఫ్ కృష్ణ ఖచ్చితమైన ప్లాప్ లుగా నమోదు కాదా,యువత చిత్రం మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటోంది.బ్లేడ్ బాబ్జి,కొత్త బంగారు లోకం ఇంకా భాక్సాఫీస్ వద్ద తమ హవాను కొనసాగిస్తున్నాయి. బి,సి సెంటర్లలలో మొదటనుంచి అనుకుంటున్నట్లుగా ఈ రెండు చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ శుక్ర వారం మరో మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిపైన పెద్దగా ఎక్సపెక్టేషన్స్ ట్రేడ్లో లేవు.