For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Virata Parvam 10 Days Collections: సండే కూడా మారని రాత.. ఘోరమైన వసూళ్లు.. అన్ని కోట్లు వస్తేనే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకుంటాయి. అలాంటి చిత్రాల్లో 'విరాట పర్వం' ఒకటి. 1990వ దశకంలో జరిగిన నక్సలైట్ ఉద్యమానికి.. యదార్థ ప్రేమకథను జోడిస్తూ రూపొందించిన ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించారు. ఎన్నో అంచనాలతో గత వారమే ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, దీనికి ఆరంభంలోనే టాక్, రివ్యూలు మంచిగా రాకపోవడంతో స్పందన కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో ఈ ప్రభావం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించింది. ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

    రియల్ లవ్ స్టోరీతో విరాట పర్వం

    రియల్ లవ్ స్టోరీతో విరాట పర్వం

    దగ్గుబాటి రానా - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల రూపొందించిన రియల్ లవ్ స్టోరీ మూవీనే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, బెనర్జీ కీలక పాత్రలను చేసిన విషయం తెలిసిందే.

    Ram Marriage: ప్రియురాలితో హీరో రామ్ పెళ్లి.. నిశ్చితార్థం, వివాహం అప్పుడే.. అమ్మాయి ఎవరంటే!

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. మొత్తంగా దీనికి రూ. 14 కోట్ల బిజినెస్‌ జరిగింది.

    10వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

    10వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది


    యదార్థ సంఘటన ఆధారంగా వేణు ఉడుగుల తెరకెక్కించిన 'విరాట పర్వం' చిత్రానికి ఆరంభం నుంచే టాక్‌కు అనుగుణంగా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. అదే కంటిన్యూ చేస్తూ రోజురోజుకూ డౌన్ అవుతూనే వస్తోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 10వ రోజు కేవలం రూ. 9 లక్షలే వసూలు అయ్యాయి.

    స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన హీరోయిన్: గతంలో చూడని విధంగా అందాల విందు

    10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    'విరాట పర్వం'కు 10 రోజుల్లోనూ తీవ్ర నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 32 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.79 కోట్లు షేర్, రూ. 4.62 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 10 రోజుల్లో కేవలం రూ. 2.79 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఎదురుగాలినే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.13 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 10 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.27 షేర్‌. రూ. 6.50 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలైంది.

    హాట్ షోలో గీత దాటిన సీరియల్ నటి: ఆమెనిలా చూస్తే మతి పోవడం ఖాయం

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    రానా - సాయి పల్లవి కాంబోలో వచ్చిన 'విరాట పర్వం' ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.60 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 4.27 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 10.23 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు.

    English summary
    Rana Daggubati And Sai Pallavi Did ‘Virata Parvam’ Under Venu Udugula Direction. This Movie Collects Rs 4.27 Crores in 10 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X