Virata Parvam 12 Days Collections: భారీ నష్టాల దిశగా విరాట పర్వం.. 14 కోట్లకు వచ్చింది ఇంతే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో చాలా వరకూ విజయాలను అందుకోవడంతో మరిన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. అలా వచ్చిన వాటిలో 'విరాట పర్వం' ఒకటి. 1990వ దశకంలో జరిగిన నక్సలైట్ ఉద్యమానికి.. యదార్థ ప్రేమకథను చూపిస్తూ తీసిన ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించారు.

ఎన్నో అంచనాలతో గత వారమే ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, దీనికి టాక్‌తో పాటు రివ్యూలు కూడా నెగెటివ్‌గానే వచ్చాయి. దీంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

యదార్థ ప్రేమకథతో విరాట పర్వం

యదార్థ ప్రేమకథతో విరాట పర్వం

దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల రూపొందించిన యదార్థ ప్రేమకథా చిత్రమే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, బెనర్జీ కీలక పాత్రలను పోషించారు.

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

ప్యూర్ లవ్ స్టోరీకి క్లిష్టమైన పాయింట్‌ను జోడించి తీసిన 'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటితో కలుపుకుని మొత్తంగా దీనికి రూ. 14 కోట్ల బిజినెస్‌ అయింది.

12వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

12వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

క్రేజీ కాంబినేషన్‌లో వేణు ఉడుగుల తెరకెక్కించిన 'విరాట పర్వం' చిత్రానికి ఆరంభం నుంచే టాక్‌కు అనుగుణంగా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. అదే కంటిన్యూ చేస్తూ రోజురోజుకూ డౌన్ అవుతూనే వస్తోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 12వ రోజు కేవలం రూ. 4 లక్షలే కలెక్ట్ అయ్యాయి.

12 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

12 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

12 రోజుల్లోనూ 'విరాట పర్వం'కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 33 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 21 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.88 కోట్లు షేర్, రూ. 4.74 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

12 రోజుల్లో ఏపీ, తెలంగాణలో కేవలం రూ. 2.88 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ భారీ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 36 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 12 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.38 షేర్‌. రూ. 6.70 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలైంది.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

రానా - సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.60 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 4.38 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 12.12 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే భారీ నష్టాలు తప్పేలా కనిపించట్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X