twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Virata Parvam 1st Week Collections: 14 కోట్ల బిజినెస్.. వారంలో భయంకరంగా.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!

    |

    బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్ టాలెంట్‌తో టాలీవుడ్‌లో మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు దగ్గుబాటి రానా. హీరోగా పరిచయం అయిన తర్వాత పలు విజయాలను అందుకున్నా.. భారీ సక్సెస్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి పల్లవితో కలిసి అతడు నటించిన చిత్రమే 'విరాట పర్వం'. 90 దశకం నాటి నక్సలైట్ ఉద్యమం సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని గత వారమే ఇది విడుదలైంది. అయితే, దీనికి కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ వారంలో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    స్వచ్చమైన ప్రేమకథతో వచ్చింది

    స్వచ్చమైన ప్రేమకథతో వచ్చింది

    దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల రూపొందించిన స్వచ్చమైన ప్రేమ కథా చిత్రమే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలను పోషించారు.

    స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

    ప్యూర్ లవ్ స్టోరీతో రూపొందిన 'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. మొత్తంగా దీనికి రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ అయింది.

    7వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

    7వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

    దగ్గుబాటి రానా.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' చిత్రానికి ఆరంభం నుంచే టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. అదే కంటిన్యూ చేస్తూ రోజురోజుకూ పడిపోతూనే ఉంది. ఫలితంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 7వ రోజు కేవలం రూ. 4 లక్షలే వచ్చాయి.

    ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

    తొలి వారంలో ఎంత వచ్చింది?

    తొలి వారంలో ఎంత వచ్చింది?

    'విరాట పర్వం' మూవీకి 7 రోజుల్లోనూ తీవ్ర నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 29 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.60 కోట్లు షేర్, రూ. 4.28 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో వారం రోజుల్లో కేవలం రూ. 2.60 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఎదురుగాలినే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.08 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి వారంలో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 షేర్‌. రూ. 6.90 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలైంది.

    Chor Bazaar Twitter Review: ఆకాశ్ సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!Chor Bazaar Twitter Review: ఆకాశ్ సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    'విరాట పర్వం' మూవీపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.60 కోట్లుగా నమోదైంది. ఇక, వారంలో దీనికి రూ. 4 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 10.50 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే ఇది డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది.

    English summary
    Rana Daggubati And Sai Pallavi Did ‘Virata Parvam’ Under Venu Udugula Direction. This Movie Collects Rs 4.00 Crores in 1st Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X