twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Virata Parvam 2 Days Collections: విరాట పర్వం మరో దెబ్బ.. 2వ రోజు ఘోరంగా.. ఎన్ని కోట్లు రావాలంటే!

    |

    కరోనా ప్రభావం కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన చాలా సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి. ఆయా చిత్రాలే ఇటీవలి కాలంలో ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా సార్లు పోస్ట్‌పోన్ అయి.. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'విరాట పర్వం'. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా స్వచ్ఛమైన ప్రేమకథతో దృశ్యకావ్యంగా రూపొందింది. ఫలితంగా భారీ అంచనాలతో విడుదలైంది. దీనికి టాక్ మంచిగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం నిరాశాజనకంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 'విరాట పర్వం' మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    క్రేజీ కాంబోలో ‘విరాట పర్వం’

    క్రేజీ కాంబోలో ‘విరాట పర్వం’


    దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల రూపొందించిన క్లిష్టమైన ప్రేమకథా చిత్రమే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలను చేశారు.

    హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులుహాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులు

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్


    తెలుగు రాష్ట్రాల్లో 'విరాట పర్వం' మూవీ భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొత్తంగా రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

    2వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

    2వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

    'విరాట పర్వం'కు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు మరో దెబ్బ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 63 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    మళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోతమళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోత

    2 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    2 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    'విరాట పర్వం' మూవీకి 2 రోజుల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 82 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.53 కోట్లు షేర్, రూ. 2.50 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 2 రోజుల్లో కేవలం రూ. 1.53 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' ప్రపంచ వ్యాప్తంగానూ అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 54 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 2 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.27 షేర్‌తో పాటు రూ. 3.90 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

    హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    స్వచ్ఛమైన ప్రేమకథకు నక్సల్స్ ఉద్యమాన్ని జోడించి తీసిన 'విరాట పర్వం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 2.27 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.23 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

    ఈ కలెక్షన్లకు సినీ పెద్దలే షాక్‌లో

    ఈ కలెక్షన్లకు సినీ పెద్దలే షాక్‌లో


    సాయి పల్లవి - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'విరాట పర్వం' మూవీకి తొలిరోజు రూ. 1.42 కోట్లే వచ్చాయి. రెండో రోజు రూ. 85 లక్షలు మాత్రమే వచ్చాయి. మొత్తంగా రెండు రోజులకు కేవలం రూ. 2.27 కోట్లు వసూలు అయ్యాయి. ఇవి ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో సంబంధం లేని విధంగా ఉన్నాయి. దీంతో ఇవి చూసి విశ్లేషకులు షాక్ అవుతున్నారు.

    English summary
    Rana Daggubati And Sai Pallavi Did ‘Virata Parvam’ Under Venu Udugula Direction. This Movie Collects Rs 2.27 Crores in 2 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X