Virata Parvam 3 Days Collections: విరాట పర్వంకు దారుణమైన కలెక్షన్లు.. 3వ రోజు ఆ మూవీ కంటే తక్కువగా!

తెలుగులో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే బలమైన కంటెంట్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో స్వచ్ఛమైన ప్రేమకు నక్సలైట్ ఉద్యమాన్ని జోడించి తెరకెక్కించిన 'విరాట పర్వం' ఒకటి. రియల్ స్టోరీని బేస్ చేసుకుని రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించారు. ఫలితంగా భారీ అంచనాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే దీనికి టాక్ మంచిగానే వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం నిరాశాజనకంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 'విరాట పర్వం' మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసింది? హిట్ అవ్వాలంటే ఇంకెంత రావాలి? అనేవి చూద్దాం పదండి!

రియల్ స్టోరీతో ‘విరాట పర్వం’

రియల్ స్టోరీతో ‘విరాట పర్వం’

దగ్గుబాటి రానా - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల రూపొందించిన సినిమానే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలను పోషించారు.

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది.

3వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

3వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో 'విరాట పర్వం'కు 3వ రోజు మరో షాక్ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 29 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 56 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'విరాట పర్వం' మూవీకి 3 రోజుల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.09 కోట్లు షేర్, రూ. 3.40 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో కేవలం రూ. 2.09 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 80 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 3 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.14 షేర్‌తో పాటు రూ. 5.35 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'విరాట పర్వం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 3.14 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 11.36 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

ఈ కలెక్షన్లకు సినీ పెద్దలే షాక్‌లో

ఈ కలెక్షన్లకు సినీ పెద్దలే షాక్‌లో

నిజజీవిత కథతో రూపొందిన 'విరాట పర్వం' మూవీకి రివ్యూలు పాజిటివ్‌గా, టాక్ మంచిగా వచ్చింది. కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం సరిగా దక్కడం లేదు. దీంతో దీనికి కలెక్షన్లు ఆశించిన రీతిలో రావట్లేదు. వీకెండ్‌లోనూ వసూళ్లు డౌన్ అవుతూనే వచ్చాయి. ఆదివారం మరీ దారుణంగా నాని సినిమా కంటే తక్కువ షేర్ రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X