twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Virata Parvam 5 Days Collections: విరాట పర్వంకు దెబ్బ మీద దెబ్బ.. 14 కోట్లకు అమ్మితే వచ్చిందింతే!

    |

    తెలుగులో ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చాలానే వస్తున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ప్రేక్షకుల మనసులు దోచుకున్నవే ఉంటున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. ఇలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'విరాట పర్వం'. నిజ జీవితం సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీని నక్సలైట్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. దీంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి టాక్ మంచిగానే వచ్చినా కలెక్షన్లు మాత్రం చాలా ఘోరంగా దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 'విరాట పర్వం' మూవీ 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    ప్యూర్ లవ్ స్టోరీగా విరాట పర్వం

    ప్యూర్ లవ్ స్టోరీగా విరాట పర్వం

    దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల రూపొందించిన చిత్రమే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలను పోషించిన విషయం తెలిసిందే.

    యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్


    క్రేజీ కాంబోలో వచ్చిన 'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. మొత్తంగా దీనికి రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ అయింది.

    5వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

    5వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

    'విరాట పర్వం' చిత్రానికి టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. అదే కంటిన్యూ చేస్తూ రోజురోజుకూ డౌన్ అవుతోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణలో దీనికి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు 5వ రోజు కేవలం రూ. 15 లక్షలు షేర్ మాత్రమే దక్కింది.

    Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరోBigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

    5 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    5 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    5 రోజుల్లోనూ 'విరాట పర్వం' మూవీకి నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.46 కోట్లు షేర్, రూ. 4.05 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో కేవలం రూ. 2.46 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.00 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 5 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.76 షేర్‌తో పాటు రూ. 6.45 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

    ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    సున్నితమైన ప్రేమకావ్యంగా రూపొందిన 'విరాట పర్వం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 3.76 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 10.74 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంత చేసుకుంటుంది.

    English summary
    Rana Daggubati And Sai Pallavi Did ‘Virata Parvam’ Under Venu Udugula Direction. This Movie Collects Rs 3.76 Crores in 5 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X