twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Virata Parvam 6 Days Collections: విరాట పర్వంకు ఊహించని దెబ్బ.. ఇదే జరిగితే అన్ని కోట్లు నష్టమే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలా వచ్చిన వాటిలో ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో ఇలాంటివి ఇంకా ఇంకా వస్తున్నాయి. ఈ క్రమంలో 90వ దశకంలో నక్సల్స్ ఉద్యమం సమయంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రమే 'విరాట పర్వం'. రానా - సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది గ్రాండ్‌గా విడుదలైంది. కానీ, ఈ చిత్రానికి అనుకున్న రీతిలో స్పందన రావట్లేదు. ఫలితంగా కలెక్షన్లు దారుణంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విరాట పర్వం' మూవీ 7 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    యదార్థ ఘటనతో విరాట పర్వం

    యదార్థ ఘటనతో విరాట పర్వం

    దగ్గుబాటి రానా - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల రూపొందించిన యదార్థ కథా చిత్రమే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలను చేశారు.

    ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

    అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

    దృశ్య కావ్యంగా వచ్చిన 'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. మొత్తంగా దీనికి రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ అయింది.

    6వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

    6వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది

    రానా.. సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' చిత్రానికి ఆరంభం నుంచే టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. అదే కంటిన్యూ చేస్తూ రోజురోజుకూ పడిపోతూనే ఉంది. ఫలితంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 6వ రోజు కేవలం రూ. 10 లక్షలు షేర్ మాత్రమే దక్కింది.

    పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు: ఆకాశ్ నీ కొడుకు కాదా.. చాలా మంది ఉన్నారంటూ!పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు: ఆకాశ్ నీ కొడుకు కాదా.. చాలా మంది ఉన్నారంటూ!

    6 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    6 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    'విరాట పర్వం' మూవీకి 6 రోజుల్లోనూ గట్టి దెబ్బే తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 1.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 28 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 16 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.56 కోట్లు షేర్, రూ. 4.21 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 6 రోజుల్లో కేవలం రూ. 2.56 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 31 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.06 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 6 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.93 షేర్‌తో పాటు రూ. 6.77 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

    యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


    'విరాట పర్వం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.60 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 3.93 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 10.57 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే దీనికి భారీ నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.

    English summary
    Rana Daggubati And Sai Pallavi Did ‘Virata Parvam’ Under Venu Udugula Direction. This Movie Collects Rs 3.93 Crores in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X