Virata Parvam Day 1 Collections: విరాట పర్వంకు బిగ్ షాక్.. తొలిరోజే ఇంత దారణమైన కలెక్షన్లా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో చాలా చిత్రాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కడంతో పాటు ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి ఆంచనాలను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కాంబినేషన్‌లో రూపొందిన 'విరాట పర్వం' ఒకటి.

స్వచ్చమైన ప్రేమకథకు నక్సల్స్ ఉద్యమాన్ని జోడించి రూపొందించిన ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో స్పందన అంతంతగానే వచ్చింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు దారుణంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'విరాట పర్వం' ఫస్ట్ డే రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

క్లిష్టమైన స్టోరీతోనే విరాట పర్వం

క్లిష్టమైన స్టోరీతోనే విరాట పర్వం

దగ్గుబాటి రానా - సాయి పల్లవి కాంబినేషన్‌లో వేణు ఉడుగుల రూపొందించిన సున్నితమైన ప్రేమకథా చిత్రమే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలను పోషించారు.

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

'విరాట పర్వం' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొత్తంగా రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది.

‘విరాట పర్వం'కు షాకింగ్ టాక్

‘విరాట పర్వం'కు షాకింగ్ టాక్

దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' మూవీ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్ దక్కింది. ఫలితంగా ఈ మూవీకి ఆరంభం నుంచే స్పందన అంతగా రాలేదు. దీంతో ఈ ప్రభావం మొదటి రోజు కలెక్షన్లపై భారీగా చూపించింది.

హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్
https://telugu.filmibeat.com/heroine/ram-gopal-varma-shares-apsara-rani-stunning-photo-110542.html

ఫస్ట్ డే ఎక్కడ.. ఎంత రాబట్టింది

ఫస్ట్ డే ఎక్కడ.. ఎంత రాబట్టింది

'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 48 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 90 లక్షలు షేర్, రూ. 1.50 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 90 లక్షలు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 12 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 40 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 1.42 షేర్‌తో పాటు రూ. 2.50 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

దగ్గుబాటి రానా - సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన 'విరాట పర్వం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 1.42 కోట్లు వచ్చాయి. అంటే మరో 13.08 కోట్లు వస్తేనే ఇది హిట్ అయినట్లు లెక్క.

మొదటి రోజే ఇంత దారుణమా?

మొదటి రోజే ఇంత దారుణమా?

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'విరాట పర్వం' మూవీకి తొలిరోజు రూ. 1.42 కోట్లే వచ్చాయి. అందులో ఏపీ, తెలంగాణలో కలిపి దీనికి రూ. 90 లక్షలే వచ్చాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఇంత తక్కువ వసూళ్లు దేనికీ రాలేదు. ఇదే కంటిన్యూ అయితే ఈ సినిమాకు నష్టాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X