Virata Parvam Business: విరాట పర్వంకు షాకింగ్ బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే రానాకు హిట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలా సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. అందులో కొన్ని సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా.. మరికొన్ని మాత్రం ఇప్పుడిప్పుడే విడుదల అవుతున్నాయి. అలాంటి వాటిలో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' ఒకటి.

సున్నితమైన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను కూడా భారీ స్థాయిలో ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో 'విరాట పర్వం' సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

నక్సలైట్ ఉద్యమంగా రాబోతుంది

నక్సలైట్ ఉద్యమంగా రాబోతుంది

రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రమే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలు చేశారు.

స్వచ్చమైన ప్రేమకథగా వస్తోంది

స్వచ్చమైన ప్రేమకథగా వస్తోంది

సరైన బ్రేక్‌ కోసం ఎదురు చూస్తోన్న దగ్గుబాటి రానా 'విరాట పర్వం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్‌తో నక్సలైట్‌ ఉద్యమం నేపథ్యంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. దీన్ని ఎంతో ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కించారు. ఇందులో సాయి పల్లవి పాత్ర ఎంతో హైలైట్‌గా ఉండబోతుందని యూనిట్ వెల్లడించింది.

వాయిదాలు.. రిలీజ్ డేట్ ఖరారు

వాయిదాలు.. రిలీజ్ డేట్ ఖరారు

సున్నితమైన కథాంశంతో క్లిష్టమైన నేపథ్యాన్ని జోడించి తీసిన 'విరాట పర్వం' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు డేట్లను కూడా ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇక, ఈ సినిమాను జూన్ 17న రాబోతుంది.

ప్రమోషన్స్ షురూ... భారీ బజ్‌తో

ప్రమోషన్స్ షురూ... భారీ బజ్‌తో

సాయి పల్లవి - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రాబోతున్న 'విరాట పర్వం' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అంతేకాదు, బుల్లితెరపై ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ప్రసారం అయ్యాయి. అలాగే, ఈ మూవీకి సంబంధించిన ప్రివ్యూ షోలు కూడా గట్టిగానే ప్లాన్ చేశారు.

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా

'విరాట పర్వం' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలను కలుపుకుని మొత్తంగా రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా

ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా

విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న 'విరాట పర్వం' మూవీ కోసం పోటీ ఏర్పడింది. దీంతో ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.50 కోట్లుగా నమోదు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X