Virata Parvam Total Collections: 14 కోట్ల బిజినెస్.. ఫుల్ రన్‌లో ఘోరంగా.. ఎన్ని కోట్ల నష్టం అంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యదార్థ సంఘటనల ఆధారంగా వచ్చే సినిమాల సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. అందుకే అలా రూపొందే చిత్రాలకు ఆరంభం నుంచే ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. తద్వారా విడుదలకు ముందే అంచనాలు ఏర్పడతాయి. అలా ఇటీవల వచ్చిన సినిమానే 'విరాట పర్వం'. 1990వ దశకంలో జరిగిన నక్సలైట్ ఉద్యమానికి.. యదార్థ ప్రేమకథను జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించారు.

ఎన్నో అంచనాలతో గత వారమే ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, నెగెటివ్ టాక్ కారణంగా కలెక్షన్లను అంతగా రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో 'విరాట పర్వం' టోటల్ కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

అమర ప్రేమకథతో విరాట పర్వం

అమర ప్రేమకథతో విరాట పర్వం

దగ్గుబాటి రానా - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల రూపొందించిన యదార్థ ప్రేమకథా చిత్రమే 'విరాట పర్వం'. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు.

 అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్

అమర ప్రేమకథతో తెరకెక్కిన 'విరాట పర్వం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటితో కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 14 కోట్లు మేర బిజినెస్‌ జరిగింది.

నెగెటివ్ టాక్.. వసూళ్లు దారుణం

నెగెటివ్ టాక్.. వసూళ్లు దారుణం

క్రేజీ కాంబినేషన్‌లో వేణు ఉడుగుల తెరకెక్కించిన 'విరాట పర్వం' చిత్రానికి ఆరంభం నుంచే టాక్‌కు అనుగుణంగా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. అదే కంటిన్యూ చేస్తూ రోజురోజుకూ డౌన్ అవుతూనే వస్తోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు ఇప్పటి వరకూ దారుణమైన వసూళ్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చింది?

'విరాట పర్వం'కు ఫుల్ రన్‌లో తీవ్ర నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.64 కోట్లు షేర్, రూ. 4.35 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో ఫుల్ రన్‌లో కేవలం రూ. 2.64 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన 'విరాట పర్వం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ భారీ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి ముగింపు టైంకు దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.06 షేర్‌. రూ. 7.05 కోట్లు గ్రాస్‌ మాత్రమే దక్కింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

సంక్లిష్టమైన పాయింట్‌తో వచ్చిన 'విరాట పర్వం' ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.60 కోట్లుగా నమోదైంది. ఇక, ముగింపు సమయానికి దీనికి రూ. 4.06 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అంటే ఈ చిత్రానికి 10.44 కోట్లు నష్టాలు వచ్చాయి. దీంతో ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

జూలై 1 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్

జూలై 1 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్

సాయి పల్లవి - రానా కాంబినేషన్‌లో ఎన్నో అంచనాలతో వచ్చి దారుణమైన ఫలితాన్ని అందుకున్న 'విరాట పర్వం' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను సదరు సంస్థ జూలై 1 నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతుంది. అంటే విడుదలైన రెండు వారాలకే ఇది ఓటీటీలోకి రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X