Virgin Boys Box Office Collections: వర్జిన్ బాయ్స్‌కు డీసెంట్ ఓపెనింగ్స్.. బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంతంటే?
రాజ్ గురు బ్యానర్‌పై రాజా దారపునేని నిర్మాతగా యువ దర్శకుడు దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

వర్జిన్ బాయ్ సినిమాను కొత్త వారితో రూపొందించిన క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. నిర్మాత రాజా దారపునేని అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాను క్వాలిటీగా మార్చింది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా 1.5 కోట్ల షేర్, 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌ను బ్రేక్ ఈవెన్‌గా నిర్ణయించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
యూత్‌ఫుల్ కంటెంట్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన వర్జిన్ బాయ్ సినిమా వినూత్న ప్రమోషన్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకొన్నది. నిర్మాత రాజా దారుపునేని అనుసరించిన ప్రచార కార్యక్రమాలు భారీగా వర్కవుట్ అయ్యాయి. స్వయంగా తానే రంగంలోకి దిగి సినిమా ప్రమోషన్స్‌లో వైరల్ కంటెంట్ క్రియేట్ చేసి మూవీని ప్రేక్షకుడికి చేరవేయడంలో సక్సెస్ అయ్యారు.
ఈ సినిమాకు వచ్చిన బజ్‌తో అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తంగా 200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కారణంగా మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. చిన్న చిత్రానికి భారీ స్పందన వచ్చిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మార్నింగ్ షోకు ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే కనిపించింది. కానీ మౌత్ టాక్‌తో ఫస్ట్, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగింది అని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపించింది.
ఇక వర్జిన్ బాయ్స్ సినిమా తొలి రోజు రెస్పెక్టబుల్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలి రోజు 30 లక్షల షేర్, 60 లక్షల గ్రాస్ కలెక్షన్లను రాబడుతుంది. వారాంతంలో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు పెరిగితే.. తొలి వారం ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే అంచనాను ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











