Virupaksha Collections:కలెక్షన్ల ఊపుతో విరూపాక్ష..బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా వసూళ్లు..5వ రోజు ఎన్ని కోట్లంటే

నూతన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో రూపొందిన మిస్టిక్ థ్రిల్లర్ విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను రాబడుతూ భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులే కాకుండా అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఊహించని వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

విరూపాక్ష బడ్జెట్, బిజినెస్:విరూపాక్ష చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే .. ఈ చిత్రానికి భారీగానే ఖర్చు చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్, టాప్ క్లాస్ సాంకేతిక నిపుణులు కారణంగా బడ్జెట్ కాస్త ఎక్కువగానే అయింది. మొత్తంగా ఈ సినిమాను 44 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 25 కోట్లు, నాన్ థియేట్రికల్ 29 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రానికి ఓవరాల్ బిజినెస్ 54 కోట్లు నమోదైంది.

Virupaksha Budget and Day 5 collections worldwide: Samyuktha Menons Movie strong at Box office

5వ రోజు ఆక్యుపెన్సీ :సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకొంటున్న విరూపాక్ష చిత్రం ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మంగళవారం 5వ రోజున యావరేజ్‌గా కనిపించింది. మార్నింగ్ షోకు 17 శాతం, మ్యాట్నీకి 26 శాతం, ఫస్ట్ షోకు 27 శాతం, సెకండ్ షోకు 37 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఓవరాల్‌గా 5వ రోజు బాక్సాఫీస్ లెక్కల ప్రకారం 27 శాతం ఆక్యుపెన్సీ రిజిస్టర్ అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

4 రోజుల ఓవరాల్ కలెక్షన్లు:గత నాలుగు రోజుల విరూపాక్ష చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 12 కోట్లకుపైగా గ్రాస్, రెండో రోజు 13 కోట్ల గ్రాస్, మూడో రోజు 12.5 కోట్ల గ్రాస్, నాలుగో రోజు 7 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ఈ చిత్రం 50 కోట్ల కలెక్షన్ల మైలురాయిని నమోదు చేసింది.

Virupaksha Budget and Day 5 collections worldwide: Samyuktha Menons Movie strong at Box office

5వ రోజు కలెక్షన్లు :విరూపాక్ష చిత్రం 5 వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే.. 4వ రోజుతో పోల్చితే దాదాపు 10 శాతం కలెక్షన్లు క్షీణించాయి. ఈ చిత్రం 5 వ రోజు బాక్సాఫీస్ వద్ద 4 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారు 55 కోట్లకు చేరువైంది. ఈ సినిమా కేవలం 5వ రోజు లాభాల జోన్‌లోకి ప్రవేశించడం విశేషంగా మారింది. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి విజయం సాధించిన చిత్రాలు అరుదుగా కనిపించాయి.

ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల వసూళ్లు:విరూపాక్ష్ గత ఐదు రోజుల టోటల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో మొత్తంగా 36 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి 3 కోట్లకుపైగా గ్రాస్, ఓవర్సీస్‌లో సుమారు 8 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం 55 కోట్ల గ్రాస్, 26 కోట్లకుపైగా షేర్ నమోదు చేసింది. ఈ చిత్రం ఊపును చూస్తే బాక్సాఫీస్ వద్ద మరిన్నీ లాభాలను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X