Virupaksha day 1 Collections విరూపాక్షకు భారీ ఒపెనింగ్స్.. సాయిధరమ్ తేజ్ మూవీ తొలి రోజు కలెక్షన్లు ఎంతటే?
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బాపినీడు సమర్పణలో బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం విరూపాక్ష. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, అందాల తార సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి ఆట నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
విరూపాక్ష బడ్జెట్ : విరూపాక్ష చిత్రాన్ని నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్ భారీ వ్యయంతో తెరకెక్కించారు. లాక్ డౌన్, సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ వాస్తవాని కంటే ఎక్కువగానే అయిందనేది ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమాను సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రీ రిలీజ్ వివరాలు : ఇక విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 7.2 కోట్లుగా, సీడెడ్‌లో 3.85 కోట్లు, ఆంధ్రాలో 8.75 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. దాంతో ఆంధ్రా, నైజాం హక్కులు 19.8 కోట్ల మేర అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 1.5 కోట్లు, ఓవర్సీస్ 1.5 కోట్ల రూపాయలతో మొత్తం 22.8 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ 23 కోట్లుగా నిర్ణయించారు.
వరల్డ్ వైడ్‌గా థియేటర్ కౌంట్ : విరూపాక్ష సినిమా టీజర్, ట్రైలర్లకు మంచి రెస్సాన్స్ రావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేశఆరు. నైజాంలో 240 స్క్రీన్లు, సీడెడ్‌లో 165 స్క్రీన్లు, ఆంధ్రాలో 310 స్క్రీన్లు కలిపి మొత్తంత తెలుగు రాష్ట్రాల్లో 715 స్రీన్లలో రిలీజ్ చేశారు. కర్నాటకలో 85 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 220 స్క్రీన్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 1020 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
విరూపాక్ష మూవీకి ఆక్యుపెన్సీ : అలాగే విరూపాక్ష ఆక్యుపెన్సీ విషయానికి వస్తే..ఈ సినిమాకు తొలి రోజు మంచి స్పందన లభించింది. మార్నింగ్ షోకు 30 శాతం, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షోకు 44 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ఈ సినిమాకు ఓవరాల్‌గా పాజిటివ్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో మౌత్ టాక్‌తో ఆక్యుపెన్సీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విరూపాక్ష తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే? : విరూపాక్ష సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3.5 నుంచి 4.5 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 5 నుంచి 6 కోట్ల రూపాయాల మధ్య కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రేంజ్ కలెక్షన్లు రాబడితే.. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా విరూపాక్ష నిలిచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











