Virupaksha day 4 Collections 50 కోట్లు కుమ్మేసిన విరూపాక్ష.. 4వ రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, అందాల తార సంయుక్త మీనన్ నటించిన మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 21వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతంలో భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్ర బాక్సాఫీస్ కలెక్షన్లకు అగ్ని పరీక్షగా మారే తొలి సోమవారం ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్:లవ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రూపొందిన విరూపాక్ష చిత్రాన్ని సుమారు 44 కోట్ల వ్యయంతో నిర్మించారు. కరోనా లాక్ డౌన్, సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కారణంగా ఈ సినిమా నిర్మాణం కొత్త ఎక్కువ రోజులే సాగింది. అయితే టీజర్లు, ట్రైలర్లు మంచి బజ్ క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో నిర్మాత ప్రసాద్‌కు రిలీజ్‌కు ముందే సుమారు 10 కోట్ల టేబుల్ ఫ్రాఫిట్ మిగిలిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

విరూపాక్ష బిజినెస్:ఇక విరూపాక్ష సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయాల్లోకి వెళితే.. నైజాం హక్కులను 7.2 కోట్లు, సీడెడ్ 3.85 కోట్లు, ఆంధ్రా, 9 కోట్లతో మొత్తంగా 20 కోట్ల బిజినెస్ వరకు జరిగింది. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు 1.5 కోట్లు, ఓవర్సీస్ 1.5 కోట్లతో మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 22.80 కోట్లుగా నమోదైంది.
విరూపాక్ష రికార్డు స్క్రీనింగ్:విరూపాక్ష బిజినెస్ హాట్ కేకుల్లా జరగడంతో పబ్లిక్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని థియేటర్ల సంఖ్యను కూడా భారీగా పెంచారు. ఈ సినిమాను నైజాంలో 240 స్క్రీన్లు, సీడెడ్‌లో 165 స్క్రీన్లు, ఆంధ్రాలో 310 స్క్రీన్లతో కలిపి మొత్తంగా 715 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 85 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 220 స్క్రీన్లతో మొత్తంగా ఈ సినిమాను 1020 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం పబ్లిక్ డిమాండ్ కారణంగా మరిన్ని థియేటర్లను పెంచుతున్నట్టు తెలుస్తున్నది.

తొలి మూడు రోజుల్లో విరూపాక్ష:విరూపాక్ష మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియావైడ్ 7.4 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఇండియాలో 9.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల గ్రాస్, మూడో రోజు ఇండియాలో 10 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా కోట్లు 12.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ఏపీలో 28 కోట్ల గ్రాస్, కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో 3 కోట్లు, ఇండియావైడ్ 29 కోట్లకుపైగా గ్రాస్, ఓవర్సీస్‌లో 8 కోట్లు నమోదు చేసింది. దాంతో గత మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల గ్రాస్ రాబట్టింది.
4వ రోజు పరీక్ష పాసైన విరూపాక్ష:ఇక విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లకు లిట్మస్ టెస్ట్‌గా మారే సోమవారం రోజు స్ట్రాంగ్‌గా వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 5.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌తో కలుపుకొని ఈ సినిమా 8 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మైలురాయిని చేరుకొన్నదని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

నాలుగు రోజుల్లోనే విరూపాక్ష లాభాల్లోకి :విరూపాక్ష చిత్రం నాలుగు రోజుల్లోనే లాభాలకు చేరువైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 23.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. అయితే ఈ చిత్రం ఊహించని విధంగా తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరువ కావడం డిస్టిబ్యూటర్లలో జోష్ కనిపిస్తుంది. ప్రస్తుతం స్గ్రాంగ్‌గా వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











