Virupaksha Hindi, Tamil Collections విరూపాక్ష డిజాస్టర్ కా బాప్.. హిందీ, తమిళంలో కలెక్షన్లు ఎంతంటే?
తెలుగులో సంచలన విజయం సాధిస్తున్న విరూపాక్ష చిత్రం హిందీ, తమిళ బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్లు సాధిస్తున్నది. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న ఈ చిత్రం తమిళ, హిందీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తెలుగులో 17 రోజులుగా భారీ వసూళ్లను సాధిస్తున్న ఈ చిత్రం ఉత్తరాదిలో పేలవమైన వసూళ్లను సాధిస్తున్నది. గత మూడు రోజుల్లో హిందీ, తమిళ భాషల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..
విరూపాక్ష రెండు వారాలు ఆలస్యంగా: తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష చిత్రం భారీ వసూళ్లు సాధిస్తున్న జోష్‌తో హిందీ, తమిళంలో మే 5వ తేదీన భారీగా రిలీజ్ చేశారు. వాస్తవానికి ఈ చిత్రం తెలుగుతోపాటు పలు భాషల్లో రిలీజ్ చేయాల్సింది. కానీ సల్మాన్ ఖాన్ మూవీ రిలీజ్ కావడం, డబ్బింగ్, ఇతర సాంకేతిక పనులు పూర్తి కావడంతో ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా హిందీ, తమిళంలో రిలీజ్ చేశారు.

సాయిధరమ్ తేజ భారీగా ప్రమోషన్: విరూపక్షకు కన్నడ, తెలుగులో భారీగా స్పందన రావడంతో, హిందీ, తమిళ మార్కెట్‌లో పాగా వేసేందుకు టీమ్ ప్రయత్నించింది. హిందీ మార్కెట్‌లో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ గట్టిగానే ప్రమోషన్ చేశారు. ముంబై, ఇతర ప్రాంతాల్లో రెండు, మూడు రోజులు భారీ ప్రమోషన్ చేశారు. దాంతో ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందనే ఆశాభావంతో చిత్ర యూనిట్ ఎదురు చూసింది.

హిందీలో పేలవంగా కలెక్షన్లు: విరూపాక్ష హిందీ వెర్షన్‌కు ఉత్తరాదిలో పెదవి విరిచారు. తొలి రోజు నుంచి మూడు రోజుల వరకు పేలవమైన కలెక్షన్లు వసూలు చేసింది. తొలి రోజు 5 లక్షలు, రెండో రోజు 5 లక్షలు, మూడో రోజు 7 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం హిందీ వెర్షన్ 17 లక్షల వసూళ్లు నమోదు చేసింది. విరూపాక్ష టీమ్‌కు ఈ కలెక్షన్లు ఊహించని పరిణామంగా మారింది.

తమిళంలో అంతంత మాత్రంగానే: ఇక తమిళ పరిస్థితి కూడా దాదాపు సేమ్ టూ సేమ్‌గా కనిపించింది. కన్నడలో మంచి రెస్పాన్స్ కూడగట్టుకొన్న ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తమిళంలో 1వ రోజు 3 లక్షలు, 2వ రోజు 5 లక్షలు, మూడో రోజు కూడా 5 లక్షల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 13 లక్షల రూపాయల వసూళ్లు రాబట్టింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు: ప్రపంచవ్యాప్తంగా విరూపాక్ష కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర, నైజాంలో ఈ చిత్రం 60.9 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల గ్రాస్, తమిళంలో 13 లక్షలు, హిందీలో 17 లక్షల కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో 13 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్‌గా ఈ చిత్రం 80 కోట్లకుపైగా గ్రాస్, 45 కోట్లకుపైగా షేర్ కలెక్షన్లు సాధించింది.


Click it and Unblock the Notifications











