Virupaksha Collections: విరూపాక్ష పెను సంచలనం.. సాయి ధరమ్ తేజ్ వంద కోట్లు.. తొలి మూవీగా రికార్డు
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న హీరోలు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. అందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకడు. పేరుకు మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినా.. నిరంతరం శ్రమిస్తూ ప్రేక్షకులను తనదైన చిత్రాలతో అలరిస్తోన్నాడు. అలాగే, ఎన్నో హిట్లను అందుకుంటోన్నాడు. ఇక, యాక్సిడెంట్ తర్వాత అతడు నటించిన చిత్రమే 'విరూపాక్ష'. హర్రర్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇది గొప్ప రికార్డును సాధించింది. మరి 'విరూపాక్ష' 27 రోజుల వసూళ్లను చూద్దామా!
విరూపాక్షగా భయపెట్టిన హీరో:సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కలయికలో వచ్చిన హర్రర్ మూవీనే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇచ్చారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే:భయపెట్టే కథతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్ జరిగింది.

27వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:సాయి ధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ జంటగా చేసిన 'విరూపాక్ష' చిత్రానికి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఈ చిత్రం వారంలోనే టార్గెట్‌ను చేరి లాభాల బాటలో వెళ్తోంది. అయితే, ఇప్పుడు వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ క్రమంలో 27వ రోజు దీనికి తెలుగులో రూ. 10 లక్షలు షేర్ మాత్రమే దక్కింది.

27 రోజులకూ ఎంత వచ్చింది?:27 రోజుల్లో 'విరూపాక్ష' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.57 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.64 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.91 కోట్లు, గుంటూరులో రూ. 2.54 కోట్లు, కృష్ణాలో రూ. 2.55 కోట్లు, నెల్లూరులో రూ. 1.27 కోట్లతో కలిపి.. రూ. 37.91 కోట్లు షేర్, రూ. 72.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

హిందీ, తమిళంలో క్లోజైందిగా:హర్రర్ కాన్సెప్టుతో రూపొందిన 'విరూపాక్ష' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. ఇక్కడ హిట్ అవడంతో మే 5వ తేదీన హిందీ, తమిళం, మలయాళంలోనూ తీసుకొచ్చారు. కానీ, ఆ భాషల్లో ఇది నాలుగు రోజులకే ఔట్ అయిపోయింది. ఫలితంగా అక్కడ నష్టాలతో రన్ ముగించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:తెలుగులో 27 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 37.91 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.86 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 57 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 27 రోజుల్లోనే రూ. 47.29 కోట్లు షేర్, రూ. 100.00 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా సాయి తేజ్ కెరీర్‌లో ఈ మార్కును చేరిన మొదటి చిత్రంగా రికార్డు సాధించింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 27 రోజుల్లోనే దీనికి రూ. 47.29 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.29 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











