Virupaksha Collections: 23 కోట్ల బిజినెస్.. 4 వారాల్లో పెను సంచలనం.. 60 లక్షలు వస్తే చరిత్రే
మెగా మేనల్లుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టినా.. తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాల్లోనూ రాణించి స్టార్‌గా ఎదిగిపోయాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. దీనికితోడు ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తోన్నాడు. అయితే, గత ఏడాది 'రిపబ్లిక్'తో ఫ్లాప్ వచ్చినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇటీవలే 'విరూపాక్ష' అనే మూవీ చేశాడు. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' మూవీ నాలుగు వారాల్లో ఎంత రాబట్టిందో మీరూ చూడండి!
విరూపాక్షగా ఎంట్రీ ఇచ్చిన సాయి : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కలయికలో వచ్చిన హర్రర్ మూవీనే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే : హర్రర్ స్టోరీతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది.

28వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది : సాయి ధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన 'విరూపాక్ష' చిత్రానికి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఈ చిత్రం వారంలోనే టార్గెట్‌ను చేరి లాభాల బాటలో వెళ్తోంది. అయితే, ఇప్పుడు వసూళ్లు క్రమంగా పడిపోతున్నా గురువారం కాస్త పెరిగింది. దీంతో 27వ రోజు దీనికి రూ. 11 లక్షలు షేర్ వచ్చింది.

4 వారాలకూ ఎంత వచ్చింది : 'విరూపాక్ష' మూవీకి 4 వారాల్లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.58 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.30 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.65 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.92 కోట్లు, గుంటూరులో రూ. 2.55 కోట్లు, కృష్ణాలో రూ. 2.56 కోట్లు, నెల్లూరులో రూ. 1.28 కోట్లతో కలిపి.. రూ. 38.02 కోట్లు షేర్, రూ. 73.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

హిందీ, తమిళంలో క్లోజైందిగా : భయపెట్టే కథతో రూపొందిన 'విరూపాక్ష' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. ఇక్కడ హిట్ అవడంతో మే 5వ తేదీన హిందీ, తమిళం, మలయాళంలోనూ తీసుకొచ్చారు. కానీ, ఆ భాషల్లో ఇది వారం కూడా ఆడలేదు. ఫలితంగా అక్కడ నష్టాలతో రన్‌ను ముగించుకుని డిజాస్టర్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది : తెలుగులో 4 వారాల్లో భారీ స్థాయిలో రూ. 38.02 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.86 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 57 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28 రోజుల్లోనే రూ. 47.40 కోట్లు షేర్, రూ. 100.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 4 వారాల్లోనే దీనికి రూ. 47.40 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.40 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. మరో రూ. 60 లక్షలు లాభాలు వస్తే.. రూ. 25 కోట్లు మార్కును చేరుతుంది.


Click it and Unblock the Notifications











