Virupaksha Collections: 23 కోట్లకు అమ్మితే డబుల్.. లాభాలతో సాయి తేజ్ సంచలనం.. అక్కడ కోట్ల నష్టాలు
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. సుప్రీమ్ హీరో అనే పేరును సార్థకం చేసుకుంటూ ముందుకు సాగిపోతోన్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. దీనికితోడు నటన, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాల్లోనూ రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నాడు. గత ఏడాది యాక్సిడెంట్‌కు గురైన అతడు.. దాని నుంచి కోలుకున్న వెంటనే 'విరూపాక్ష' అనే మూవీతో వచ్చాడు. హర్రర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' మూవీ ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేసిందో మీరూ చూడండి!
విరూపాక్షగా వచ్చిన సాయి తేజ్: సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీనే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్ చేసుకుంది.
అలాంటి టాక్.. భారీ వసూళ్లు: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన 'విరూపాక్ష' చిత్రానికి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలో పోటెత్తాయి. ఇలా ఈ సినిమా వారంలోనే టార్గెట్‌ను చేరుకుంది. అప్పటి నుంచి భారీ లాభాలను అందుకుంది.

తెలుగు రాష్ట్రాలో వసూళ్లు ఇలా: 'విరూపాక్ష' మూవీకి ఫుల్ రన్‌లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.67 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.93 కోట్లు, గుంటూరులో రూ. 2.57 కోట్లు, కృష్ణాలో రూ. 2.58 కోట్లు, నెల్లూరులో రూ. 1.28 కోట్లతో కలిపి.. రూ. 38.22 కోట్లు షేర్, రూ. 73.40 కోట్లు గ్రాస్ వసూలైంది.
హిందీ, తమిళంలో క్లోజైందిగా: హర్రర్ స్టోరీతో తెరకెక్కిన 'విరూపాక్ష' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంది. కానీ, ముందుగా తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ హిట్ అవడంతో మే 5వ తేదీన హిందీ, తమిళం, మలయాళంలోనూ విడుదల చేశారు. కానీ, ఆ భాషల్లో ఇది వారం కూడా ప్రదర్శితం అవలేదు. ఫలితంగా అక్కడ కోట్ల నష్టాలతో రన్ ముగిసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగులో ఫుల్ రన్‌లో భారీ స్థాయిలో రూ. 38.22 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.86 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 57 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా రూ. 47.60 కోట్లు షేర్, రూ. 100.40 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?
సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 47.60 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.60 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











