Virupaksha Collections హిందీ, తమిళంలో విరూపాక్ష కథ కంచికి.. తెలుగులో 19వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, అందాల భామ సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష చిత్రం గత రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే అదే ఊపును మూడో వారంలో కొనసాగించలేకపోతున్నది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూడో వారంలో హిందీ, తమిళం, మలయాళంలో రిలీజైంది. అయితే తెలుగులో వసూలు చేసిన భారీ కలెక్షన్లను మిగితా భాషల్లో రాబట్టలేక చతికిల పడింది. అయితే గత 5 రోజులుగా హిందీ, తమిళంలో కలెక్షన్లు ఎలా ఉన్నాయి? తెలుగులో 18వ రోజు కలెక్షన్లు ఎలా సాధించిందనే వివరాల్లోకి వెళితే..
25 కోట్లకుపైగా బిజినెస్‌తో :సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన విరూపాక్ష చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమాను సుమారుగా 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ కావడంతో థియేట్రికల్ బిజినెస్‌ను 25 కోట్ల వద్ద క్లోజ్ చేశారు. దాదాపు 1500 స్క్రీన్లలో ప్రదర్శించారు. అయితే తొలుత తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడంతో ఏపీ, నైజాంలో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టింది.

గత రెండు వారాల్లో భారీగా:విరూపాక్ష చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే తెలుగులో భారీ వసూళ్లును నమోదు చేసింది. ఈ చిత్రం తొలి వారంలో 41 కోట్ల రూపాయలను రాబట్టింది. రెండో వారంలో 15 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు వారాల్లో 56 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అయితే మూడో వారంలో ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్‌ను ప్రభావితం చేయలేకపోయింది.

మూడో వారంలో పేలవంగా :మూడో వారంలో హిందీ, తమిళ భాషల్లో రిలీజైన విరూపాక్ష చిత్రం పేలవమైన వసూళ్లను రాబట్టింది. తొలి రోజు హిందీలో 5 లక్షల కలెక్షన్లు, రెండో రోజు 5 లక్షలు, మూడో రోజు 7 లక్షలు, నాలుగో రోజు 3 లక్షలు, ఐదో రోజు 3 లక్షల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం హిందీలో మొత్తంగా 23 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుందనుకొన్న ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేసింది.

తమిళంలో పొన్నియన్ దెబ్బకు:ఇక విరూపాక్ష తమిళ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమాకు పొన్నియన్ సెల్వన్ భారీ దెబ్బ కొట్టింది. ఈ చిత్రం కనీసం కూడా తమిళంలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. తమిళంలో ఈ చిత్రం మొదటి రోజు 3 లక్షలు, రెండో రోజు 5 లక్షలు, మూడో రోజు 5 లక్షలు, నాలుగో రోజు 1 లక్ష రూపాయలు, ఐదో రోజు సుమారు 1 లక్ష రూపాయలు వసూలు చేసింది.

తెలుగులో 19వ రోజున :విరూపాక్ష చిత్రం తెలుగులో బాక్సాఫీస్ జర్నీని ముగించినట్టు కనిపిస్తున్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు క్రమేపీ తగ్గిపోతున్నాయి. 19వ రోజు ఈ చిత్రం ఏపీ, నైజాంలో కలిపి 63 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 60 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల కాలంలో తెలుగులో మీడియం బడ్జెట్ చిత్రం ఈ విధంగా కలెక్షన్లు రాబట్టడం రికార్డుగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా విరూపక్ష కలెక్షన్లు:విరూపాక్ష చిత్రం ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఈ చిత్రం 60 కోట్లు నమోదు చేయగా, హిందీలో 23 లక్షలకుపైగా, తమిళంలో 15 లక్షల రూపాయలను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం భారీగానే కలెక్ట్ చేసింది. అమెరికా, ఇతర దేశాల్లో కలిపి 6 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి 3 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 47 కోట్ల షేర్, 85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











