Just In
- 54 min ago
మెగా 152: వైరల్ అవుతున్న చిరంజీవి లుక్.. లీక్ అయినట్లేనా?
- 1 hr ago
ధోనీపై స్టార్ హీరో కామెంట్.. ఆయనో ‘దబాంగ్’ ప్లేయర్’ అంటూ!
- 3 hrs ago
నా ప్రపంచమే అతను.. కొద్దిరోజుల్లోనే మీ ముందుంచబోతున్నా: రాశిఖన్నా
- 3 hrs ago
ఫైటర్ హీరోయిన్ ఫిక్స్: విజయ్‌కు జోడీగా స్టార్ డాటర్.. అడ్వాన్స్‌గా అంత ఇచ్చారా.!
Don't Miss!
- Sports
అబ్బాయిపై దాడి.. భారత మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!!
- News
జనసేన ఎమ్మెల్యే మరోసారి సభలోనే: సీఎం జగన్ పై ప్రశంసలు: చారిత్రాత్మక నిర్ణయమంటూ..!
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Finance
24x7 NEFT: ఆ గంటలో మాత్రం కుదరదు, ఛార్జీలు, ఆయా బ్యాంకు పరిమితులు
- Technology
టాటా స్కై బింగే + సెట్-టాప్-బాక్స్ ఎలా ఉందొ చూడండి
- Automobiles
పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
రెండు రోజుల్లో యాక్షన్.. విశాల్, తమన్నా వసూళ్లు చూడండి
విశాల్, తమన్నా జంటగా తెరకెక్కిన యాక్షన్ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 15వ తేదీ) ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 'అభిమన్యుడు', 'పందెం కోడి 2' లాంటి హిట్స్ తర్వాత విశాల్ నుంచి వచ్చిన మూవీ కావడంతో ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల రన్ పూర్తిచేసిన యాక్షన్ ఎంత రాబట్టిందంటే.
యాక్షన్ అంటూ రా ఏజెంట్ నేపథ్యంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'యాక్షన్' సినిమా ఎబో యావరేజ్ రేంజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 66 లక్షల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజూ అదే బాటలో వెళ్ళింది. రెండవ రోజు కూడా సుమారు 51 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది.

రెండు రోజుల్లో యాక్షన్ ఏరియావైస్ రిపోర్ట్ చూసినట్లయితే..
నైజాం - 52.5 లక్షలు
సీడెడ్ - 18.4 లక్షలు
గుంటూరు - 8.3 లక్షలు
ఉత్తరాంధ్ర - 11.2 లక్షలు
తూర్పు గోదావరి - 9.4 లక్షలు
పశ్చిమ గోదావరి - 6 లక్షలు
కృష్ణా - 8.2 లక్షలు
నెల్లూరు - 4.2 లక్షలు వచ్చాయి.
మొత్తంగా చూస్తే రెండు రోజుల్లో 1.18 కోట్లు వసూలు చేసింది యాక్షన్. విశాల్ కెరీర్లో మొదటి సారి సుమారు 55 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 7.2 కోట్లకి అమ్ముడు పోయింది. చూడాలి మరి ఆ మార్క్ వరుకూ యాక్షన్ వెళుతుందా? లేదా.. అనేది.