ENEMY Day 2 collections.. ఊహించని విధంగా దుమ్మురేపుతున్న కలెక్షన్లు..మొదటి రోజు ఎంతంటే?
యాక్షన్ హీరో విశాల్ తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఆయన ఆర్యతో కలిసి తాజాగా 'ఎనిమి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన 'ఎనిమీ' సినిమా తమిళ భాషతో పాటు తెలుగులో కూడా దీపావళి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు సినిమా మీద అంచనాలు పెంచడంతో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమా ఊహించిన మేర కలెక్షన్లు అందుకుందా లేదా అనేది రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం.

మంచి ప్రీ రిలీజ్ తో
తెలుగులో 'నోటా' సినిమా చేసి మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. 'వాడు వీడు' తర్వాత విశాల్, ఆర్య లు కలిసి నటించిన మరో చిత్రం 'ఎనిమీ'. వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడం వల్ల ఇద్దరి అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. నిజమైన ఎనిమీ ఎవరంటే అన్నీ తెలిసిన స్నేహితుడే లాంటి డైలాగ్స్ 'ఎనిమీ'పై ఆసక్తి పెంచాయి. దీపావళి సందర్భంగా రజినీకాంత్ 'పెద్దన్న'తో పోటీపడుతూ తెలుగు, తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తొలిరోజే డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.

కథ ఏంటంటే?
సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ప్రాంతంలో స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్ళు ఎలా కలుస్తారు? అన్నది ఈ సినిమా కథాంశం. విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు నెలకొనడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది.

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కలెక్షన్లు ఇలా
హీరో విశాల్, ఆర్య కలిసి నటించిన 'ఎనిమీ' సినిమా నిజాంలో 12 లక్షలు, సీడెడ్ 9 లక్షలు, ఉత్తరాంధ్ర 5 లక్షలు, ఈస్ట్ గోదావరి 3 లక్షలు, వెస్ట్ గోదావరి 2.6 లక్షలు, గుంటూరు 3 లక్షలు, కృష్ణా జిల్లా 3 లక్షలు, నెల్లూరు 2 లక్షలు అలా మొత్తం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలు కలిపి నలభై లక్షల షేర్ సాధించగా, అరవై ఐదు లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. పెద్దన్న సినిమా లైన్ లో ఉండడంతో ఈ సినిమాకు కలెక్షన్లు రావనుకుంటే ఊహించిన దాని కంటే ఎక్కువ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రెండు రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే
ఈ సినిమా నిజాంలో 50 లక్షలు, సీడెడ్ 25 లక్షలు, ఉత్తరాంధ్ర 16 లక్షలు, ఈస్ట్ గోదావరి 12 లక్షలు, వెస్ట్ గోదావరి 9 లక్షలు, గుంటూరు 15 లక్షలు, కృష్ణా జిల్లా 8 లక్షలు, నెల్లూరు 7 లక్షలు అలా మొత్తం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలు కలిపి కోటి నలభై రెండు లక్షల షేర్ సాధించగా, రెండు కోట్ల పాతిక లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది.

మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా
ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజులే కోటి నలభై రెండు లక్షల షేర్ సాధించగా ఐదు కోట్ల టార్గెట్ కు ఇంకా 3.58 కోట్ల దూరంలో ఉంది. ఇక తమిళనాడులో ఈ సినిమా 5.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే మిగతా భారతదేశంలో 1.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సేస్ లో సినిమా 2.1 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 12.55 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా 6.2 కోట్ల షేర్ సాధించింది.


Click it and Unblock the Notifications











