twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vishal chakra Collections.. మొదటి రోజు కంటే తగ్గినా కూడా!

    |

    విశాల్ సినిమాలంటే ఇప్పుడు అందరికీ ఓ రేంజ్‌లో అంచనాలుంటాయి. ఆయన నటిస్తున్న సినిమాలు, ఎంచుకుంటున్న కథలు అన్నీ కూడా సామాన్యుడిని ఆకట్టుకునేలానే ఉంటున్నాయి. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న మోసాలు, సైబర్ నేరాలు ఇలా కాంటేంపరరీ విషయాలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేశాడు. విశాల్ చక్ర అంటూ వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

    టాక్‌తో సంబంధం లేకుండా..

    టాక్‌తో సంబంధం లేకుండా..

    విశాల్ చక్రకు టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు బాగానే వసూళ్లు వచ్చాయి. ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నింటితో చక్రపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విశాల్‌కు ఓ మాదిరి కలెక్షన్లు వచ్చాయి.

     కోటికి పైగా..

    కోటికి పైగా..

    ఒకే సారి నాలుగు చిత్రాలు విడుదలవుతుండటం.. ఆల్రెడీ ఉప్పెన బ్లాక్ బస్టర్ అవ్వడంతో అన్ని సినిమాలకు ఓ మోస్తరు కలెక్షన్లే వచ్చాయి. అలా విశాల్ చక్ర సినిమాకు కోటికిపైగా షేర్ వచ్చింది. మొదటి రోజు చక్ర బాగానే రాబట్టింది. కానీ రెండో రోజు మాత్రం కాస్త డ్రాప్ అయింది.

    ఏరియాల వారిగా..

    ఏరియాల వారిగా..

    రెండో రోజు విశాల్ చక్ర కలెక్షన్లు ఇలా ఉన్నాయి.. నైజాం ఏరియాలో 26లక్షలు, సీడెడ్‌లో 15లక్షలు, ఉత్తరాంధ్రలో 9లక్షలు, ఈస్ట్ 7లక్షలు, వెస్ట్ 4.2లక్షలు, గుంటూరు 6 లక్షలు, కృష్ణా 5.2లక్షలు, నెల్లూరులో 4లక్షలను కొల్లగొట్టింది. మొత్తంగా పర్వాలేదనిపించింది.

     మొత్తంగా ఎంతంటే?

    మొత్తంగా ఎంతంటే?

    నైజాం, సీడెడ్ అని ఇలా కొన్ని ఏరియాల్లో విశాల్ తన సత్తా చాటాడు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చక్ర సినిమా మొదటి రోజు కోటి 8 లక్షలు కొల్లగొడితే రెండో రోజు 76 లక్షలు వసూళ్లు చేసింది. అలా రెండో రోజు చక్ర కాస్త వెనుకడుగు వేసింది.

    ఎంత రాబట్టాలంటే..

    ఎంత రాబట్టాలంటే..

    అయితే ఈ సినిమా గట్టెక్కాలంటే మాత్రం టార్గెట్ చాలా పెద్దగానే ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్ల మేరకు బిజినెస్ చేసింది చక్ర. అయితే బ్రేక్ ఈవెన్ రావాలంటే కనీసం 5.4కోట్ల వసూళ్లు రాబట్టాలి. కానీ మొత్తంగా రెండు రోజులకు కలిపి 1.84కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 3.56కోట్లు వస్తే నిర్మాతలు గట్టెక్కే చాన్స్ ఉంది.

    English summary
    Vishal Chakra day 2 worldwide collection.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X