twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Laatti Pre Release Bussiness: విశాల్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే.. ఈసారి హిట్ కొట్టాల్సిందే!

    |

    తమిళ హీరో విశాల్ తన ప్రతి సినిమాను కూడా తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తమిళంలో ఎలాగైతే ప్రమోషన్ చేస్తూ ఉంటాడో తెలుగులో కూడా అదే ఎనర్జితో హడావిడి చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇక అతని తదుపరి సినిమా లాఠీ కూడా తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలవుతోంది అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత బిజినెస్ చేసింది.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

    ఒకప్పుడు మంచి కలెక్షన్స్

    ఒకప్పుడు మంచి కలెక్షన్స్

    విశాల్ గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అతనికి అంతగా సక్సెస్ అయితే రావడం లేదు. పందెంకోడి సినిమా తర్వాత విశాల్ ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వచ్చాడు తెలుగులో కూడా ఒకప్పుడు అతని సినిమాలు మీడియం రేంజ్ హీరోల తరహాలో మంచి కలెక్షన్స్ అందుకుంటూ ఉండేవి.

    చివరి ఐదు సినిమాలు ఫ్లాప్

    చివరి ఐదు సినిమాలు ఫ్లాప్

    అయితే గల ఐదు సినిమాలు కూడా అతనికి పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ముఖ్యంగా అయోగ్య, యాక్షన్, చక్ర, ఎనిమి, సామాన్యుడు ఇలా అన్ని డిఫరెంట్ సినిమాలు కూడా చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే ఈ సినిమాలన్నిటిని కూడా ప్రముఖ టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను చేత విడుదల చేయబడ్డాయి. అతను విశాల్ సినిమాలతో దారుణంగా నష్టపోవాల్సి వచ్చింది.

     లాఠీ ప్రమోషన్స్

    లాఠీ ప్రమోషన్స్

    అయితే ఇప్పుడు లాఠీ సినిమాను కూడా వరంగల్ శ్రీను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విడుదల చేస్తూ ఉండడం విశేషం. ఈసారి తప్పకుండా విశాల్ కూడా తెలుగులో మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సినిమా ప్రమోషన్స్ లో కూడా రెగ్యులర్ గా పాల్గొంటూ ఉన్నాడు. తెలుగు న్యూస్ చానల్స్ కు కూడా అతను ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు.

    థియేటర్స్ కౌంట్

    థియేటర్స్ కౌంట్

    అయితే లాఠీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మినిమం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ముఖ్యంగా నైజాంలో లాఠీ సినిమాను 125 పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇక సీడెడ్ ఏరియాలో 70 థియేటర్లలో విడుదల చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా 170 కి పైగా ధియేటర్లలో లాఠీ సినిమా విడుదలవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి లాఠీ సినిమా థియేటర్ల సంఖ్య 365 కు పైగానే ఉండబోతున్నట్లు సమాచారం.

    బిజినెస్ ఎంత?

    బిజినెస్ ఎంత?

    ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే విశాల్ లాఠీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ టార్గెట్ తో గేమ్ స్టార్ట్ చేయబోతోంది. ఈ సినిమా 4 కోట్లకు రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. అంటే బాక్సాఫీస్ వద్ద 4.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటేనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చినట్లు. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేస్తుందో లేదో చూడాలి.

    English summary
    Vishal Laatti movie telugu Pre Release Business and theatres count..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X