హీరో విశాల్ వసూళ్లలోనూ మాస్.. 3 రోజుల్లో పందెంకోడి 2 కలెక్షన్లు ఇవే
మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పందెంకోడి 2'. లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలై సూపర్ ఓపెనింగ్స్‌తో సెన్సేషనల్ హిట్ సాధించింది.

అభిమన్యుడు తర్వాత
అభిమన్యుడు తర్వాత తెలుగులో మాస్ హీరో విశాల్‌కి మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘పందెంకోడి 2'. ట్రెమండస్ ఓపెనింగ్స్‌తో అన్ని ఏరియాల్లో సూపర్‌హిట్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని 6 కోట్ల రూపాయలకు కొంటే 3 రోజుల్లోనే 4 కోట్ల 21 లక్షల 33 వేల 402 రూపాయల షేర్ సాధించి స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా
తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులకు పందెంకోడి 2 కలెక్షన్స్ భారీగా నమోదయ్యాయి. నైజాంలో రూ. 1,15,36,943 కోట్లు వసూలు కావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రెండు రాష్రాల్లో టోటల్ షేర్ రూ. 4,21,33,402 వచ్చిందని వెల్లడించారు. వారాంతంలో మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆంధ్రాలోనూ
ఇక ఆంధ్రాలోనూ విశాల్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. వైజాగ్‌లో రూ.57,16,358, ఈస్ట్ గోదావరిలో రూ.25,62,668, వెస్ట్ గోదావరిలో రూ.24,79,924,
గుంటూరులో రూ. 44,97,002, కృష్ణాలో రూ. 30,98,435, నెల్లూరులో రూ.15,59,048, సీడెడ్ రూ.91,83,024, బళ్ళారిలో రూ. 15,00,000 కలెక్షన్లను సాధించినట్టు నిర్మాత టాగూర్ మధు వెల్లడించారు.

నిర్మాత టాగూర్ మధు థాంక్స్
‘పందెంకోడి'తో పెద్ద హిట్ సాధించిన విశాల్‌కి ఇప్పుడు పందెంకోడి 2 మరో సూపర్‌హిట్ చిత్రం అయింది. ఈ ఘనవిజయానికి కారకులైన ప్రేక్షకులకు చిత్ర సమర్పకులు ఠాగూర్ మధు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి విజయాన్ని అందించిన విశాల్‌కు, లింగుస్వామికి, కీర్తి సురేష్‌కి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు థాంక్స్ చెప్పారు.


Click it and Unblock the Notifications











