Mark Antony Collections విశాల్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ స్టార్ హీరో, హీరోయిన్లు విశాల్, ఎస్ జే సూర్య, రీతూ వర్మ, సెల్వరాఘవన్, అభినయ తదితరులు నటించిన చిత్రం మార్క్ ఆంటోని. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్, టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలను సినిమాపై అంచనాలు, ఆసక్తిని రేపాయి. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్, కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
మార్క్ ఆంటోని బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్లతో తీయడం నిర్మాణ వ్యయం భారీగానే అయింది. ఈ సినిమాను సుమారు 28 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2950 స్క్రీన్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కంటెంట్ డిఫరెంట్‌గా ఉండటంతో మంచి ఓపెనింగ్స్ లభించాయి.

మార్క్ ఆంటోని మూవీకి మార్నింగ్ షో తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి.. మ్యాట్నీకల్లా పాజిటివ్‌గా మారింది. దాంతో అడ్వాన్స్ బుకింగ్, కరెంట్ బుకింగ్ భారీగా పెరిగింది. దాంతో భారీ కలెక్షన్లు రావడానికి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విశాల్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మార్క్ ఆంటోని సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తమిళ వెర్షన్‌కు ఉదయం ఆటకు 40 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. పాండిచ్చేరిలో 90 శాతం, చెన్నైలో 60 శాతం, కోయంబత్తూరులో 60 శాతం, త్రిచీలో 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

మార్క్ ఆంటోని తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 30 శాతం, మ్యాట్నీకి 30 శాతం, ఫస్ట్ షోకు 35 శాతం, సెకండ్ షోకు 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అత్యధికంగా గుంటూరులో 54 శాతం, వరంగల్‌లో 40 శాతం, కాకినాడలో 52 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. మిగితా ప్రాంతాల్లో 35 శాతం లోపు ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక మార్క్ ఆంటోని సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. విశాల్ కెరీర్‌లో ది బెస్ట్ ఓపెన్సింగ్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు 5.5 కోట్లు తమిళంలో తెలుగులో 1 కోటి రూపాయలతో మొత్తంగా 6.5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. శని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శనివారం ఈ సినిమా తెలుగు, తమిళంలో కలిపి 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయవచ్చు అని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. రెండు రోజుల్లో కలిపి ఈ సినిమా తెలుగు, తమిళంలో కలిపి 14 కోట్ల మేర నమోదు చేసే అవకాశం ఉంది.
మార్క్ ఆంటోని సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఈ సినిమా కనీసం బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల షేర్, 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. తెలుగులో 4 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంది. ఈ సినిమా లాభాల్లోకి ఎన్ని రోజుల్లో ప్రవేశిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











