‘దేనికైనా రెడీ’ 2డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
హైదరాబాద్: వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడిన మంచు విష్ణు ఎట్టకేలకు తన తాజా సినిమా 'దేనికైనా రెడీ' చిత్రంతో నిలదొక్కుకున్నాడు. దేనికైనా రెడీ చిత్రానికి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మంచు విష్ణు కెరీర్లోనే ఈచిత్రం హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం 'సుడిగాడు' చిత్రం రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
దేనికైనా రెడీ చిత్రం విజయదశమిని పురస్కరించుకుని ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా 1,200 స్క్రీన్లలో విడుదలైంది. ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి ఈచిత్రానికి మంచి రేటింగ్ రావడంతో సినిమా అంచనాలు పెరిగాయి. పైగా సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉండటంతో తొలి రోజు ఈచిత్రం విడుదలైన థియేటర్లు 70% నుంచి 100% ఆక్యుపెన్సీ సాధించాయి.
ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దసరా హాలీడే కావడం సినిమాకు కలిసొస్చింది. అయితే గురువారం నార్మిల్ వర్కింగ్ డే కావడంతో బిజినెస్ 10% మేర డౌన్ అయింది. రెండో రోజు ఈ చిత్రం రూ. 3.5 కోట్లు వసూలు చేసింది.
శుక్రవారం బక్రీద్ కావడంతో సినిమా బిజినెస్ పుంజుకుని రూ. 4.15 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. శనివారం, ఆదివారాల్లో సినిమా ఫలితాలు అద్భుతంగా ఉంటాయని, సినిమా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ టాక్ రావడం కలిసొస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











