Ginna Closing worldwide Collections: బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు.. మంచు హిస్టరీలోనే దారుణంగా కలెక్షన్లు!
మంచు విష్ణు నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ లాంటి క్రేజీ కాంబినేషన్ కూడా ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించలేకపోయింది. కోన వెంకట్, నాగేశ్వర్ రెడ్డి లాంటి కథ, మాటలు అందించినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ఏ మేరకు లాభాలను సాధించిందంటే?

జిన్నా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
జిన్నా చిత్రం ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ఆంధ్రా, తెలంగాణలో 3 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 25 లక్షలు, హిందీ, ఓవర్సీస్ కలిపి మొత్తం 4.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అయితే మంచు విష్ణు చేసిన ప్రమోషన్స్‌కు మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా సినిమాపై పాజిటివ్ అంచనాలు నెలకొన్నాయి.

బాక్సాఫీస్ వద్ద జిన్నా విఫలం
జిన్నా చిత్రం రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. కథాపరంగా, సన్నిలియోన్ ఫెర్ఫార్మెన్స్‌కు మంచి స్పందన వ్యక్తమైంది. పాజిటివ్ అంశాలను సానుకూలంగా మార్చుకొని..ప్రేక్షకుడుని థియేటర్‌కు రప్పించడంలో జిన్నా విఫలమయ్యాడు. దాంతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని నమోదు చేసింది.

నైజాం, సీడెడ్, ఆంధ్రాలో
జిన్నా చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే పేలవమైన వసూళ్లు రాబట్టింది. ఇక కర్ణాటక, హిందీ, ఓవర్సీస్‌లో అదే పరిస్థితిని కనిపించింది. నైజాంలో 21 లక్షలు, సీడెడ్‌లో 15 లక్షలు, ఆంధ్రాలో 23 లక్షలు వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో మొత్తం కలిపి 59 లక్షలు వసూలు చేసింది.

ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో
ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. కర్ణాటక, యూఎస్ఏలో వసూళ్లు దారుణంగా నమోదయ్యాయి. కర్ణాటక, తమిళ, మలయాళం, ఓవర్సీస్‌లో కలిపి 14 లక్షల రూపాయాల షేర్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

10 కోట్ల మేర బడ్జెట్‌తో
జిన్నా సినిమా విషయానికి వస్తే.. 10 కోట్ల మేర బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా బిజినెస్ 4.5 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించారు. అయితే ఈ సినిమా దాదాపు 4 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. మంచు ప్రొడక్షన్స్‌లో వచ్చిన సినిమాల్లో అత్యధిక నష్టాలు తెచ్చిన సినిమా ఇదే అంటూ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











