Mosagallu Day1 Collections: షాకింగ్‌గా ‘మోసగాళ్లు’ కలెక్షన్లు.. వచ్చింది గోరంత.. రావాల్సింది కొండంత

చాలా కాలంగా సరైన హిట్ పడక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు మంచు వారి అబ్బాయి విష్ణు. అప్పుడెప్పుడో తొలినాళ్లలో కొన్ని విజయాలను అందుకున్న అతడు.. అప్పటి నుంచి మరోసారి హిట్ ట్రాక్ ఎక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రయోగం చేసినా విఫలం అవుతూనే ఉంది. దీంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం 'మోసగాళ్లు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ మూవీ మొదటి రోజు షాకింగ్ రిపోర్టులను అందుకుంది. ఆ వివరాలు మీకోసం!

సోదరితో కలిసి ‘మోసగాళ్లు'లా మారిన విష్ణు

సోదరితో కలిసి ‘మోసగాళ్లు'లా మారిన విష్ణు

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మోసగాళ్లు'. ఈ థ్రిల్లర్‌ మూవీకి జెఫ్రీ గీచిన్‌ దర్శకుడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరో సోదరిగా కనిపిస్తోంది. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు ఈ సినిమాను స్వయంగా నిర్మించాడు. ప్రపంచంలో పెద్దదైన ఐటీ స్కాం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, నవదీప్ కీలక పాత్రలు చేశారు.

 అంచనాలు భారీగానే.. అందుకే బిజినెన్ ఇలా

అంచనాలు భారీగానే.. అందుకే బిజినెన్ ఇలా

భారీ హిట్ కోసం వేచి చూస్తున్న మంచు విష్ణు.. ఈ సారి పెద్ద ప్లాన్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇందుకోసం రూ. 50 కోట్లతో సినిమాను రూపొందించాడు. అందుకు అనుగుణంగానే టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేలా చేశాడు. అన్ని రకాలుగా దీనికి రూ. 30 కోట్లు వచ్చింది. థియేట్రికల్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 కోట్ల వరకూ నమోదైంది.

పాన్ ఇండియా రిలీజ్.. టాక్ మాత్రం నిరాశగా

పాన్ ఇండియా రిలీజ్.. టాక్ మాత్రం నిరాశగా

ఎన్నో అంచనాల నడుమ 'మోసగాళ్లు' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఆరంభం నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కంటెంట్ కొత్తగానే ఉన్నప్పటికీ.. దాన్ని తెరకెక్కించిన విధానం అంతగా ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఆరోజు విడుదలైన చిత్రాలన్నింటిలోనూ దీనికి ఆదరణ తక్కువైనట్లు వార్తలు వచ్చాయి.

 మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

మొదటి రోజు టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లు తక్కువగా వచ్చాయి. తద్వారా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.60 లక్షలు, గుంటూరులో రూ. 2.60 లక్షలు, కృష్ణాలో రూ. 2.70 లక్షలు, నెల్లూరులో రూ. 1.40 లక్షలతో రెండు రాష్ట్రాల్లో రూ. 34 లక్షలు షేర్, రూ. 52 లక్షలు గ్రాస్ వచ్చింది.

 ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో నిరాశ పరిచిన 'మోసగాళ్లు' కేవలం రూ. 34 లక్షలు మాత్రమే వసూలు చేసింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 3 లక్షలు రాబట్టింది. దీంతో మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 40 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక, మిగిలిన భాషలకు సంబంధించిన రిపోర్టులు కూడా సోసోగానే ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

ప్రపంచ వ్యాప్తంగా 'మోసగాళ్లు' బిజినెస్ రూ. 20 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు కేవలం రూ. 40 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి. దీంతో ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 20.60 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. శనివారం, ఆదివారం ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X