twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mosagallu 3Days Collections: పెళ్లి తర్వాత కాజల్‌కు భారీ షాక్.. అదే జరిగితే చెత్త రికార్డు ఖాయం!

    |

    జయాపజయాలతో ఏమాత్రం సంబంధాలు లేకుండా సినిమాలు చేసే హీరోల్లో మంచు వారి అబ్బాయి విష్ణు ఒకడు. కెరీర్ ఆరంభంలో 'ఢీ', 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' వంటి ఓ మోస్తరు హిట్లను అందుకున్న అతడు.. చాలా కాలంగా సరైన బ్రేక్ దొరకక ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌తో కలిసి 'మోసగాళ్లు' అనే సినిమా చేశాడతను. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌తో వచ్చిన ఈ మూవీకి ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

    కాజల్‌.. మంచు విష్ణు.. మోసగాళ్లుగా మారి

    కాజల్‌.. మంచు విష్ణు.. మోసగాళ్లుగా మారి

    మంచు విష్ణు - కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్‌గా చేసిన చిత్రం 'మోసగాళ్లు'. జెఫ్రీ గీచిన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచంలో పెద్దదైన ఐటీ స్కాం ఆధారంగా రూపొందింది. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు ఈ సినిమాను స్వయంగా నిర్మించాడు. నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, నవదీప్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది.

    అంచనాలు భారీగానే.. బిజినెన్ కూడా అలా

    అంచనాలు భారీగానే.. బిజినెన్ కూడా అలా

    భారీ హిట్ కోసం వేచి చూస్తున్న మంచు విష్ణు.. ఈ సారి పెద్ద ప్లాన్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇందుకోసం రూ. 50 కోట్లతో సినిమాను రూపొందించాడు. అందుకు అనుగుణంగానే టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేలా చేశాడు. అన్ని రకాలుగా దీనికి రూ. 30 కోట్లు వచ్చింది. థియేట్రికల్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 కోట్ల వరకూ నమోదైంది.

    మూడో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

    మూడో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

    మూడో రోజు కూడా మోసగాళ్లు మూవీకి కలెక్షన్లు తక్కువగా వచ్చాయి. తద్వారా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.40 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1.90 లక్షలు, నెల్లూరులో రూ. 1.10 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం రూ. 20 లక్షలు షేర్, రూ. 36 లక్షలు గ్రాస్ వచ్చింది.

    మూడు రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసింది?

    మూడు రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసింది?

    ఎన్నో అంచనాల నడుమ 'మోసగాళ్లు' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఆరంభం నుంచే బ్యాడ్ టాక్ వచ్చింది. కంటెంట్ కొత్తగానే ఉన్నప్పటికీ.. దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలు వచ్చాయి. దీంతో మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 69 లక్షలు షేర్, రూ. 1.28 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఎంతంటే?

    తెలుగు రాష్ట్రాల్లో నిరాశ పరిచిన 'మోసగాళ్లు' మూడు రోజులకు కలిపి రూ. 69 లక్షలు మాత్రమే వసూలు చేసింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 10 లక్షలు రాబట్టింది. దీంతో మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు రూ. 87 లక్షలు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. దీంతో పెళ్లి తర్వాత వచ్చిన కాజల్ చిత్రానికి భారీ షాక్ తగిలినట్లైంది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    'మోసగాళ్లు' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో కేవలం రూ. 87 లక్షలు మాత్రమే వచ్చాయి. ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 20.13 కోట్లు కలెక్ట్ చేయాలి. వీకెండ్‌లోనే సత్తా చాటలేకపోయిన ఈ చిత్రం వీక్ డేస్‌లో రాణించడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఎక్కువ నష్టాలను ఎదుర్కొన్న చిత్రంగా నిలిచే ప్రమాదం కూడా ఉంది.

    English summary
    Vishnu Manchu is an Indian actor and producer known for his works in Telugu cinema and television. He had a brief stint as a child artist with the 3985 film Ragile Gundelu. Years later, he starred in the 2003 Telugu action film Vishnu, for which he won the Filmfare Best Male Debut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X