Vishnu Vinyasam Closing Collections: విష్ణు విన్యాసం క్లోజింగ్ కలెక్షన్లు.. శ్రీవిష్ణు హిట్టా? ఫట్టా?
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, యువ స్టార్ హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటించిన తాజా చిత్రం విష్ణు విన్యాసం. కమెడియన్ సత్య, మురళీశర్మ, బ్రహ్మజీ, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించారు. కామెడీ, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుమంత్ నాయుడు నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమాకు రధన్ మ్యూజిక్ అందించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీకేయన్ రోహిణి ఎడిటర్‌గా, ఏ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతల్ని నిర్వర్తించారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 27 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కామెడీ ప్రధానంగా సాగే పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌తో రాజీ లేకుండా నిర్మించారు. ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా భారీగా నిర్వహించారు. ఈ రెమ్యునరేషన్లు, ఇతర ఖర్చులు కలిపి మొత్తంగా 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వాల్యూను 8.5 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారని పేర్కొన్నారు.
శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్‌కు క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకులు సానుకూలంగా స్పందించడంతో ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా గత ఏడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల గ్రాస్, 5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించింది. కర్ణాటకలో 1.15 కోట్ల రూపాయల గ్రాస్, తమిళనాడులో 25 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో మరో 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 11.5 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.
ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా ఆదరణ దక్కింది. ఈ సినిమాకు నార్త్ అమెరికాలో 300K డాలర్లు, యూకే, యూరప్‌లో 50K డాలర్లు, మిగితా దేశాల్లో 25K డాలర్లతో మొత్తంగా 375K డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది.
ఈ సినిమా ద్వారా శ్రీ విష్ణు తన ఖాతాలో సక్సెస్‌ను వేసుకొన్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 80 శాతానికిపైగా రికవరీ సాధించింది. దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. ఈ చిత్రం రానున్న రోజుల్లో లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











