Vishnu Vinyasam Day 1 Collections: విష్ణు విన్యాసం బాక్సాఫీస్ కలెక్షన్స్.. శ్రీవిష్ణు మూవీకి తొలిరోజు ఎంతంటే?

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్‌ శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం విష్ణు విన్యాసం. నయన సారిక హీరోయిన్‌గా నటించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ నాయుడు జీ నిర్మించారు. యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఇంకా ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. విష్ణు విన్యాసం మూవీకిసాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా.. రాదన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకేయన్ రోహిణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదిన విష్ణు విన్యాసం మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు శ్రీ విష్ణు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

విష్ణు విన్యాసంకు రికార్డ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి విష్ణు విన్యాసం మూవీకి 19 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాల నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీపై హైప్ నెలకొంది.

Vishnu Vinyasam Day 1 Expected Box Office Collections Worldwide Sree Vishnu s film good start at GBOC

విష్ణు విన్యాసంకు రిలీజ్‌కు ముందే లాభాలు
విష్ణు విన్యాసం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమా 26 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తద్వారా 7 కోట్ల రూపాయల ట్రేబుల్ ప్రాఫిట్‌‌ను ముందే అందించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు శ్రీవిష్ణు. దాంతో విష్ణు విన్యాసంకు థియేటర్‌లో వచ్చేదంతా నిర్మాతలకు అదనపు లాభమే.

విష్ణు విన్యాసం బ్రేక్ ఈవెన్ టార్గెట్
విష్ణు విన్యాసం మూవీకి ఆంధ్రా, నైజాంలలో 7 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల రూపాయల రేంజ్‌లో బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో శ్రీ విష్ణు మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల రూపాయల షేర్, 25 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించాయి. ఈ సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో విష్ణు విన్యాసం మూవీని వరల్డ్ వైడ్‌గా 900 థియేటర్స్‌లో విడుదల చేశారు.

విష్ణు విన్యాసం ఓవర్సీస్ కలెక్షన్స్
విష్ణు విన్యాసం మూవీకి యూఎస్‌లో ప్రదర్శించిన ప్రీమియర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. అమెరికాలో విష్ణు విన్యాసం మూవీకి 247 సెంటర్స్‌కు గాను 369 షోలు ఏర్పాటు చేయగా... 2818 టికెట్లు అమ్ముడయ్యాయి. దాంతో విష్ణు విన్యాసం మూవీకి 41432 డాలర్లు (భారత కరెన్సీలో 38 లక్షల రూపాయలు) వసూలైంది. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఓవరాల్‌గా ఓవర్సీస్ నుంచి విష్ణు విన్యాసం మూవీ 89777 డాలర్లు (82 లక్షల రూపాయలు) రాబట్టినట్లు ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా తెలిపారు.

విష్ణు విన్యాసం తొలి రోజు కలెక్షన్స్
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీపై హైప్ నెలకొంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సమయం కావడంతో బుకింగ్స్‌పై కొంతమేర ప్రభావం చూపుతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీవిష్ణు మూవీకి తొలిరోజున ఇండియాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 27 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 388 షోలు, విశాఖలో 102 షోలు, బెంగళూరులో 85 షోలు, విజయవాడలో 78 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ నివేదించింది.

వీకెండ్ కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలలో బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం విష్ణు విన్యాసం మూవీకి ఇండియాలో 17 లక్షల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. శ్రీవిష్ణు మూవీకి తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X